దానిమ్మ పండు పోషకాలు సమృద్ధిగా ఉండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే, దానిమ్మ పండుతో పాటు దాని ఆకులు, బెరడు కూడా అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
దానిమ్మ ఆకులు ఎరుపు రంగులో, చిన్నగా, గుండ్రంగా ఉంటాయి మరియు వీటి నుంచి సుగంధ పసరు వాసన వస్తుంది. ఆయుర్వేదంలో ఈ ఆకుల ప్రత్యేకత గురించి వివరించబడింది. దానిమ్మ ఆకులతో ఏ ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చర్మ రోగాల నివారణ:దానిమ్మ ఆకులను కుష్టు వ్యాధి, చర్మ సంబంధిత సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ ఆకుల కషాయాన్ని తయారు చేసి రోజుకు రెండు సార్లు తాగితే, సీజనల్ దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. నిద్రలేమి సమస్య: నిద్రలేమితో బాధపడేవారికి దానిమ్మ ఆకుల పేస్ట్‌తో చేసిన కషాయం అద్భుత ఔషధం. మూడు వంతుల నీటిలో ఆకుల పేస్ట్ వేసి, నీరు అర వంతు అయ్యే వరకు మరిగించి, రాత్రి నిద్రపోయే ముందు తాగితే సుఖనిద్ర లభిస్తుంది.
3. చర్మ సమస్యలు: గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులతో ఇబ్బంది పడేవారు దానిమ్మ ఆకుల పేస్ట్‌ను బాహ్యంగా అప్లై చేస్తే ఉపశమనం కలుగుతుంది. అలాగే, శరీరంపై గాయాలు, పుండ్లు త్వరగా మానడానికి ఈ పేస్ట్ సహాయపడుతుంది.
4. చెవి నొప్పి, ఇన్ఫెక్షన్: చెవి నొప్పి లేదా ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు దానిమ్మ ఆకుల రసంలో నువ్వుల నూనె లేదా ఆవనూనె కలిపి, ఆ మిశ్రమాన్ని రెండు చుక్కల చొప్పున చెవుల్లో వేస్తే నొప్పి, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి.
5. నోటి సమస్యలు: నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు, నోటిలో పుండ్లు వంటి సమస్యలకు దానిమ్మ ఆకుల రసాన్ని నీటిలో కలిపి పుక్కిలిస్తే ఉపశమనం లభిస్తుంది.
6. మొటిమల నివారణ: ముఖంపై మొటిమల సమస్య ఉన్నవారు దానిమ్మ ఆకుల పేస్ట్‌ను మొటిమలపై రాస్తే మొటిమలు తగ్గుతాయి.
7. జీర్ణ సమస్యలు: అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, విరేచనాల వంటి సమస్యలతో బాధపడేవారు రోజుకు రెండు టీస్పూన్ల దానిమ్మ ఆకుల రసాన్ని తాగితే ఈ సమస్యలు తగ్గుతాయి.
దానిమ్మ ఆకులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి. వీటిని సరైన విధంగా ఉపయోగించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు సహజమైన చికిత్స పొందవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.