ఉల్లికారం చట్నీ ఇప్పుడు చెప్పిన విధానంలో చెఉస్కున్తె చాలా బాగుంటుంది.టిఫిన్లలోకి ఎంతో రుచిగా ఉంటుంది.
పదార్థాలు:
- ఉల్లిపాయలు - 2
- తాలింపు గింజలు - 1 టేబుల్ స్పూన్
- చింతపండు - కొద్దిగా
- బెల్లం తరుగు - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- నూనె - కొద్దిగా
తయారీ విధానం:
1. మిక్సీ జార్‌లో ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ బెల్లం తరుగు, కొద్దిగా చింతపండు, మరియు కొన్ని చుక్కల నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.
2. స్టవ్ వెలిగించి, కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి.
3. నూనె వేడయ్యాక, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసి వేగించండి.
4. తాలింపు గింజలు చక్కగా వేగిన తర్వాత, గ్రైండ్ చేసిన ఉల్లికారం మిశ్రమాన్ని కడాయిలో వేసి బాగా కలపండి. దీనిని 4 నిమిషాల పాటు ఉడికించండి.
5. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.
ఈ విధంగా తయారు చేసిన ఉల్లికారం చట్నీ మెత్తని దోసెలతో చాలా రుచిగా ఉంటుంది. ఈ చట్నీ మరియు స్పాంజ్ దోసెల తయారీ విధానం మీకు నచ్చితే, ఒకసారి ట్రై చేసి చూడండి!