Sponge Dosa Recipe । మెత్తగా మృదువుగా నోట్లో కరిగిపోయే స్పాంజ్ దోశ.. చేసేయండిలా ఇన్‌స్టంట్‌గా!

హోటల్స్ లో చేసే సెట్ దోసెలు ఎక్కువ మంది ఇష్టంగా తింటారు. వేడివేడిగా ఈ స్పాంజ్ దోసెలు వారు అందించే కారం చట్నీ, సాంబార్, పల్లీ చట్నీతో ఎంతో రుచిగా ఉంటాయి. అయితే, ఈ మెత్తని దోసెలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా పెరుగు, వంటసోడా, చుక్క నూనె ఉపయోగించకుండా.

కావలసిన పదార్థాలు:

- బియ్యం - 1 కప్పు

- ఉప్పు - రుచికి సరిపడా

- లావు అటుకులు - 1 కప్పు

తయారీ విధానం:

1. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం తీసుకొని, రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. అదే కప్పుతో లావు అటుకులు కూడా తీసుకొని, రెండు సార్లు కడిగి శుభ్రం చేయండి.

2. కడిగిన బియ్యంలో అటుకులు కలిపి, తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టండి. అప్పటికప్పుడు దోసెలు తయారు చేయాలనుకుంటే, వేడి నీటిలో అర గంట పాటు నానబెట్టండి.

3. నానబెట్టిన బియ్యం, అటుకులను మిక్సీ జార్‌లో వేసి, కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి.

4. ఈ పిండిలో తగినంత నీరు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. స్పాంజ్ దోసెల కోసం పిండి కాస్త పల్చగా ఉండాలి, అప్పుడే దోసెలు మృదువుగా వస్తాయి.

5. స్టవ్ వెలిగించి, దోసె పెనం వేడి చేయండి. పెనం బాగా కాగిన తర్వాత, గరిటెతో పిండి తీసుకొని కాస్త మందంగా దోసె వేయండి.

6. దోసె వేసిన తర్వాత, పెనంపై మూత పెట్టి కాసేపు ఉడికించండి. ఆపై దోసెను గరిటెతో తిప్పి, మరో వైపు కూడా ఎర్రగా కాల్చి ప్లేట్‌లోకి తీసుకోండి.

7. మిగిలిన పిండితో ఇలాగే స్పాంజ్ దోసెలు తయారు చేయండి. అంతే, సులభంగా మృదువైన స్పాంజ్ దోసెలు సిద్ధం!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top