బనానా బర్ఫీ
కావలసిన పదార్థాలు:
- అరటిపండ్లు - 3 (ముక్కలుగా కోసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి)
- కొబ్బరి తురుము - 1½ కప్పు
- నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
- మిల్క్ పౌడర్ - 1 కప్పు
- బెల్లం తురుము - ¾ కప్పు
- ఏలకుల పొడి - ½ టీస్పూన్
- చిక్కటి పాలు - ¼ కప్పు (మరిగించినవి)
- బాదం - గార్నిష్ కోసం
తయారీ విధానం:
1. ఒక గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం తురుము, పాలు వేసి, స్టవ్ మీద సిమ్ ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ ఉండాలి.
2. మిశ్రమం కొంచెం గట్టిపడుతున్నప్పుడు నెయ్యి, అరటిపండ్ల గుజ్జు, మిల్క్ పౌడర్, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి.
3. మిశ్రమం గట్టిగా అయ్యాక, ఒక పళ్లెంలోకి తీసి, జీడిపప్పు, బాదం ముక్కలతో అలంకరించి, 3-4 గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి.
4. తర్వాత కావలసిన ఆకారంలో ముక్కలుగా కోసి, సర్వ్ చేయాలి.