టమాట కరివేపాకు పచ్చడి
కావాల్సిన పదార్థాలు:
- నూనె - 2 టీస్పూన్లు
- నువ్వులు - 2 టీస్పూన్లు
- పచ్చికొబ్బరి తురుము - ½ కప్పు
- పచ్చిమిర్చి - 10 నుంచి 15
- కరివేపాకు - 75 గ్రాములు
- టమాటాలు - 300 గ్రాములు
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడెక్కిన తర్వాత 2 టీస్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో నువ్వులు వేసి వేగనివ్వాలి. నువ్వులు వేగిన తర్వాత పచ్చికొబ్బరి తురుము వేసి వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కరివేపాకు వేసి వేయించి, స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
అదే కళాయిలో 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేసి, టమాట ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఉడికించి, స్టవ్ ఆఫ్ చేయాలి. టమాటాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో ముందుగా వేయించిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత టమాట ముక్కలు వేసి మరోసారి గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి.
తాళింపు : కళాయిలో 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో తాళింపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, మినపప్పు), ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తాళింపు వేగిన తర్వాత దాన్ని పచ్చడిలో వేసి బాగా కలపాలి. రుచికరమైన టమాట కరివేపాకు పచ్చడి సిద్ధం! సర్వ్ చేసి ఆస్వాదించండి.