ప్రతిరోజూ ఉదయం చాలామంది అల్పాహారంలో భాగంగా యాపిల్స్ తింటారు. కొందరు రోజూ రెండు నుంచి మూడు యాపిల్స్ తీసుకుంటారు. నిజానికి, రోజూ యాపిల్స్ తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. "రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం లేదు" అనే సామెత కూడా ఉంది. రోజూ రెండు యాపిల్స్ 30 రోజుల పాటు తినడం వల్ల శరీరానికి ఏమి జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
రోజూ రెండు యాపిల్స్ నెల రోజుల పాటు తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇది శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక, చర్మాన్ని ఆరోగ్యవంతంగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. యాపిల్స్‌లో ఉండే ఫైబర్ (ఇన్సాల్యుబుల్ ఫైబర్) జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
అంతేకాదు, రోజూ రెండు యాపిల్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. యాపిల్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తాయి, దీనివల్ల చర్మం యవ్వనంగా, మెరిసేలా కనిపిస్తుంది.
రోజూ యాపిల్స్ తినడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది మరియు కంటి చూపు మెరుగుపడుతుంది. యాపిల్స్‌లోని గుణాలు పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్‌ల వంటి వ్యాధులకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, యాపిల్స్ ఊబకాయం, తలనొప్పి, ఆస్తమా, అనీమియా, క్షయ, కీళ్లనొప్పులు, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. రోజూ రెండు యాపిల్స్ తినడం ద్వారా శరీరం ఆరోగ్యంగా, చురుకుగా ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.