వేసవిలో విరివిగా లభించే పుచ్చపండు ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. ఎండలో దాహాన్ని తీర్చేందుకు ఇది అద్వితీయం. అయితే, చాలామంది పుచ్చపండు తిని గింజలను పారేస్తారు, కానీ నిపుణులు ఇది పొరపాటని అంటున్నారు.
పుచ్చకాయ గింజలు రుచిలో ఆకర్షణీయంగా లేకపోయినా, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజల వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం.
పుచ్చపండులోని నీరు శరీరానికి ఎంతో ఉపయోగకరం. మూత్రపిండాలు, మూత్రనాళ సమస్యలున్నవారికి ఇది వరంలాంటిదని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత పుచ్చపండు రసం తాగితే జీర్ణం త్వరగా జరుగుతుంది. ఊబకాయం తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
పుచ్చకాయ గింజల్లో విటమిన్లతోపాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉన్నాయి. ఈ గింజల్లోని అమైనో ఆమ్లాలు రక్తనాళాలను వెడల్పు చేసి, రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. అధిక ప్రోటీన్ కంటెంట్ రక్తపోటును నియంత్రిస్తుంది.
పుచ్చపండులో విటమిన్ ఎ, బి, సి, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. గింజల్లో కాల్షియం ఉండటం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది కండరాల పనితీరును, నరాల చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది. పుచ్చకాయలోని లైకోపీన్ పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది.
గింజల్లోని లైసిన్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అలాగే, లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ క్యాన్సర్ కణాలను నియంత్రిస్తుంది, మెదడు నరాలను బలపరుస్తుంది. కామెర్ల వంటి సమస్యలకు ఈ గింజలు మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్ ఉండటం వల్ల జుట్టు నాణ్యత మెరుగవుతుంది, పెరుగుదల ప్రోత్సహిస్తుంది, జుట్టు రాలడం, డ్యామేజ్‌ను నివారిస్తుంది. ఈ గింజలను తరచూ తినడం వల్ల చర్మం కాంతివంతమవుతుంది, ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు, చర్మం పొడిబారకుండా ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.