Beetroot Fry :బీట్రూట్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పింక్ రంగు కూరగాయ. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. బీట్‌రూట్‌ను సలాడ్‌గా, జ్యూస్‌గా లేదా ఫ్రై రూపంలో తీసుకోవచ్చు. కొందరికి నేరుగా బీట్‌రూట్ తినడం ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి వారు బీట్‌రూట్ ఫ్రై చేసుకుంటే, అది రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలను కూడా అందిస్తుంది. బీట్‌రూట్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్రూట్ – 4 (మధ్యస్థ పరిమాణం)
జీలకర్ర – అర టీస్పూన్
ఆవాలు – అర టీస్పూన్
శనగపప్పు – 1 టీస్పూన్
మినపప్పు – 1 టీస్పూన్
కరివేపాకు – 1 రెమ్మ
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – 1/4 టీస్పూన్
ధనియాల పొడి – 1/4 టీస్పూన్
సాంబార్ పొడి – 2 టేబుల్ స్పూన్లు
నూనె – 2 టేబుల్ స్పూన్లు
బీట్‌రూట్ ఫ్రై తయారీ విధానం:
ముందుగా బీట్‌రూట్‌ను శుభ్రంగా కడిగి, పై తొక్క తీసేయాలి.తర్వాత బీట్‌రూట్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఒక కళాయిలో నూనె వేసి, వేడి అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి వేయించాలి.
ఈ పోపు వేగిన తర్వాత, కట్ చేసిన బీట్‌రూట్ ముక్కలను వేసి బాగా వేయించాలి.బీట్‌రూట్ కొద్దిగా వేగిన తర్వాత, పసుపు, ఉప్పు వేసి కలపాలి.ఇప్పుడు కళాయికి మూత పెట్టి, 10 నిమిషాల పాటు మీడియం మంట మీద వేయించాలి.
తర్వాత ధనియాల పొడి, సాంబార్ పొడి వేసి బాగా కలిపి, పూర్తిగా వేగే వరకు వేయించాలి.
ఇలా చేస్తే రుచికరమైన బీట్‌రూట్ ఫ్రై సిద్ధమవుతుంది.ఈ ఫ్రైని అన్నం, చపాతీ, పుల్కాతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
బీట్‌రూట్‌ను ఆహారంలో తరచూ చేర్చుకోవడం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. బీట్‌రూట్‌లో ఫోలేట్ అధికంగా ఉంటుంది, ఇది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
గుండె సంబంధిత సమస్యలు, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.రక్తహీనత సమస్యను తగ్గించడంలో బీట్‌రూట్ ఎంతగానో సహాయపడుతుంది. బీట్‌రూట్‌ను తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.