Bigg Boss 9 Agnipariksha:'అగ్ని పరీక్ష' షోలో ఒక్కో జడ్జి పొందే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ఈ సీజన్ బిగ్ బాస్ 9 (Bigg Boss 9 Telugu) పై ప్రేక్షకుల్లో ఎన్నడూ లేనంత ఉత్సాహం కనిపిస్తోంది. గత సీజన్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, ఈ సీజన్‌కు ఇంతటి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ‘అగ్నిపరీక్ష’ (Agnipareeksha) షో.
సామాన్యులను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపే ప్రక్రియలో భాగంగా ఈ షో నిర్వహించారు. గత 8 రోజులుగా జయ్ హాట్‌స్టార్‌లో ఈ షో ఎపిసోడ్‌లు అప్‌లోడ్ అవుతున్నాయి. ఈ షోలో నిర్వహించే ప్రతి టాస్క్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. కంటెస్టెంట్‌లను ఓటింగ్ లైన్‌లో కూడా పెట్టారు.
ఈ షోకు జడ్జిలుగా నవదీప్, బిందు మాధవి, అభిజిత్ వ్యవహరిస్తున్నారు. మొదట్లో వీరి నిర్ణయాలపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ, ఎపిసోడ్‌లు గడిచే కొద్దీ వారి నిర్ణయాలు సరైనవని నెటిజన్లు ఒప్పుకున్నారు. ఉదాహరణకు, షాకిబ్‌కు ఆడిషన్స్‌లో అభిజిత్, బిందు మాధవి రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు, కానీ నవదీప్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి అతన్ని హోల్డ్‌లో పెట్టాడు.
బిగ్ బాస్‌కు పనికిరాని వ్యక్తికి గ్రీన్ ఫ్లాగ్ ఎందుకిచ్చావని బిందు మాధవి నవదీప్‌ను ప్రశ్నించింది. అయినప్పటికీ, నవదీప్ అతనికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించాడు. ఇప్పుడు షాకిబ్‌ను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు, సోషల్ మీడియా పోలింగ్‌లో అతనికి భారీ ఓట్లు వస్తున్నాయి. దీంతో నవదీప్ నిర్ణయం సరైనదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఈ ముగ్గురు జడ్జిలు తమ సమయాన్ని వృథా చేసుకోవడానికి ఇక్కడికి రారు. వారికి భారీ రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినప్పుడే వస్తారు. నవదీప్‌కు ఒక్క రోజు షూటింగ్‌కు రూ. 2.5 లక్షలు, అభిజిత్, బిందు మాధవిలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం.
9 రోజుల పాటు షూటింగ్ జరిగిన ఈ ‘అగ్నిపరీక్ష’ కోసం నవదీప్‌కు రూ. 22.5 లక్షలు, అభిజిత్, బిందు మాధవిలకు చెరో రూ. 18 లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చారట. యాంకర్ శ్రీముఖికి ఒక్క రోజు షూటింగ్‌కు రూ. 4 లక్షలు, అంటే మొత్తం రూ. 36 లక్షలు ఇచ్చారని తెలుస్తోంది. కేవలం ఈ నలుగురికే దాదాపు రూ. 1 కోటి బడ్జెట్‌ను బిగ్ బాస్ యాజమాన్యం ఖర్చు చేసింది.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.