OG Movie: ‘ఓజీ’ నటీనటుల రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా..?

OG Movie Actors
OG Movie: ‘ఓజీ’ నటీనటుల రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా.. తెలుగు రాష్ట్రాల్లో ‘ఓజీ’ ఫీవర్ మొదలైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా సెప్టెంబర్ 25 (గురువారం) నుంచి థియేటర్లలో ఘనంగా ప్రదర్శితం కానుంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి నుంచి ప్రీమియర్ షోలు కూడా జరగనున్నాయి. ‘సాహో’ ఫేమ్ డైరెక్టర్ సుజిత్ రూపొందించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు స్టార్ నటులు నటిస్తున్నారు. 

ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్ వంటి ప్రముఖ నటులు వివిధ పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి ఒక స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ‘ఓజీ’ నటుల రెమ్యునరేషన్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

‘ఓజీ’ సినిమాకు ప్రధాన స్తంభం పవన్ కల్యాణే. ఆయన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని రూ. 100 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి రూ. 6 నుంచి 8 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్‌కు రూ. 2 కోట్లు, విలన్ పాత్రలో నటించిన ఇమ్రాన్ హష్మీకి రూ. 5 కోట్లు రెమ్యునరేషన్‌గా అందినట్లు సమాచారం.

ఇక సత్యదాదా పాత్రలో కనిపించనున్న ప్రకాశ్ రాజ్ రూ. 1.5 కోట్లు, శ్రియా రెడ్డి రూ. 40 లక్షలు, అర్జున్ దాస్ రూ. 40 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడు తమన్ రూ. 5 కోట్లు ఛార్జ్ చేసినట్లు సమాచారం. మిగతా నటీనటులు, సాంకేతిక సిబ్బంది కూడా గణనీయమైన రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సినిమా నిర్మాణ బడ్జెట్ రూ. 250 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. అయితే, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ‘ఓజీ’ సినిమా ఇప్పటికే రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top