Hair Loss:హెడ్‌ఫోన్స్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందా? అలా జరగకుండా ఉండటానికి ఏం చేయాలి?

Hair loss
Hair Loss:హెడ్‌ఫోన్స్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందా? అలా జరగకుండా ఉండటానికి ఏం చేయాలి..ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడకం గణనీయంగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారిలో చాలా మంది హెడ్‌ఫోన్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, హెడ్‌ఫోన్స్ వాడటం వల్ల జుట్టు రాలుతుందని చాలా మంది అనుకుంటారు. ఈ విషయంలో నిజం ఎంత ఉంది? నిపుణులు దీని గురించి ఏమి చెబుతున్నారు? ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

హెడ్‌ఫోన్స్ వల్ల ట్రాక్షన్ అలోపేసియా వస్తుందా?
జుట్టు ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు జుట్టు రాలడాన్ని ట్రాక్షన్ అలోపేసియా అంటారు. జుట్టును ఎక్కువ సేపు లాగడం లేదా ఒత్తిడికి గురిచేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. టైట్‌గా ఉండే క్యాప్‌లు, హెల్మెట్‌లు ఎక్కువ సేపు ధరించడం వల్ల జుట్టు రాలే అవకాశం ఉంది. జుట్టు మీద ఒత్తిడి పెరగడం, గాలి ఆడకపోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి, చివరికి జుట్టు రాలి బట్టతల సమస్య ఏర్పడవచ్చు. పెద్ద సైజు హెడ్‌ఫోన్స్ కూడా నెత్తిని ఎక్కువ సేపు అదిమి ఉంచడం వల్ల జుట్టు రాలే అవకాశం ఉందని కొందరు అనుకుంటారు.

హెడ్‌ఫోన్స్ వల్ల నిజంగానే జుట్టు రాలుతుందా?
హెడ్‌ఫోన్స్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందని చెప్పడానికి ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు. ఈ విషయంపై ఎలాంటి సైంటిఫిక్ అధ్యయనాలు నిర్వహించబడలేదు. టైట్ హెడ్‌బ్యాండ్‌లు, టోపీలు, లేదా హెల్మెట్‌లు ఎక్కువ సేపు ధరించడం వల్ల ట్రాక్షన్ అలోపేసియా వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 

అయితే, హెడ్‌ఫోన్స్ వల్ల జుట్టు రాలుతుందని ఏ అధ్యయనం నేరుగా నిరూపించలేదు. కొందరు హెడ్‌ఫోన్స్ వాడితే జుట్టు పల్చబడుతుందని చెప్పినప్పటికీ, అవి వ్యక్తిగత అనుభవాలు మాత్రమేనని నిపుణులు అంటున్నారు. కాబట్టి, టైట్ హెడ్‌ఫోన్స్ నెత్తిమీద ఒత్తిడి కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, ఇది శాస్త్రీయంగా నిరూపితం కాలేదు.

జుట్టు రాలినట్లు అనిపిస్తే ఏం చేయాలి?
రోజూ హెడ్‌ఫోన్స్ ఉపయోగించడం వల్ల జుట్టు పల్చబడినట్లు లేదా రాలినట్లు అనిపిస్తే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ట్రాక్షన్ అలోపేసియాను ముందుగానే గుర్తిస్తే సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవచ్చు:

టైట్‌గా ఉండే హెడ్‌ఫోన్స్ లేదా హెడ్‌బ్యాండ్‌ల వాడకాన్ని తగ్గించండి లేదా ఆపండి.జుట్టు నిపుణుడు (హెయిర్ స్పెషలిస్ట్)ని సంప్రదించండి.తగిన చర్యలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చు.

ముందస్తు జాగ్రత్తలు
హెడ్‌ఫోన్స్ వల్ల జుట్టు రాలుతుందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది:
టైట్‌గా ఉండే హెడ్‌ఫోన్స్ లేదా హెడ్‌బ్యాండ్‌లను నివారించండి.
హెడ్‌ఫోన్స్ ధరించిన ప్రదేశంలో జుట్టు రాలడం లేదా పల్చబడటం గమనిస్తే, కొన్ని రోజులు వాటి వాడకాన్ని ఆపండి.
అప్పుడప్పుడు మీ జుట్టు స్థితిని పరిశీలించండి.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టును ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top