Vijay Deverakonda-Rashmika Mandanna :విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీరిద్దరి ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలో మరో సెలబ్రిటీ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరో, హీరోయిన్‌గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ఇటీవల వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది.గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విజయ్, రష్మిక పేర్లు హాట్ టాపిక్‌గా మారాయి. అక్టోబర్ 3వ తేదీ ఉదయం విజయ్ నివాసంలో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని వీరు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఈ రూమర్స్‌పై విజయ్, రష్మిక స్పందించకపోవడంతో వార్తలు మరింత ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సినిమాల్లో కలిసి నటించారు.
ఈ సినిమాల తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారినట్లు చెబుతున్నారు. కొన్నాళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో, విజయ్, రష్మిక వ్యక్తిగత విషయాలపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం రష్మిక వరుస హిట్‌లతో జోష్‌లో ఉండగా, చేతినిండా సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
ఇటీవల 'కింగ్‌డమ్' సినిమాతో విజయం సాధించిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌లో నిమగ్నమై ఉన్నాడు.నివేదికల ప్రకారం, రష్మిక ఆస్తుల విలువ సుమారు రూ.66 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే, విజయ్ దేవరకొండ ఆస్తుల విలువ రూ.70 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం.
ఇద్దరి ఆస్తులను కలిపితే రూ.136 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. సినిమాలతో పాటు వ్యాపారాలు, ఎండార్స్‌మెంట్‌ల ద్వారా వీరిద్దరూ గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. విజయ్ తన 'రౌడీ వేర్' ఫ్యాషన్ లేబుల్ ద్వారా వ్యాపారం చేస్తుండగా, రష్మిక పర్ఫ్యూమ్ వ్యాపారంలో ఉన్న సంగతి తెలిసిందే.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

