Vijay Deverakonda-Rashmika :రష్మిక-విజయ్ దేవరకొండ మధ్య వయసు తేడా తెలిస్తే ఆశ్చర్యపోతారు.. టాలీవుడ్‌లో రొమాంటిక్ జంటల్లో రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ జోడీ ముందు వరుసలో ఉంటుంది. వీరి తెరపై కెమిస్ట్రీకి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. 2018లో వీరి కాంబోలో వచ్చిన 'గీతా గోవిందం' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో విజయ్-రష్మిక రొమాంటిక్ జంటగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెరపై వీరి రసాయనం ఆడియన్స్‌ను బాగా ఆకర్షించింది.
ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఇద్దరికీ వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత 2019లో వీరిద్దరూ కలిసి 'డియర్ కామ్రేడ్' సినిమా చేశారు. ఈ సినిమా తర్వాత వీరి మధ్య బంధం మరింత బలపడింది. అయితే, వీరిద్దరూ చాలాసార్లు వివిధ ప్రదేశాల్లో కెమెరాకు చిక్కడంతో డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు వచ్చాయి. తాజాగా, సన్నిహిత వర్గాల ద్వారా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.
విజయ్-రష్మికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ఈ వార్తతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఇక వీరి మధ్య వయసు తేడా ఎంతనే దానిపై నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. రష్మిక మందన్న 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలో జన్మించింది. 2025లో ఆమె వయసు 29 సంవత్సరాలు. ఇక విజయ్ దేవరకొండ 1989 మే 9న హైదరాబాద్‌లో జన్మించాడు. ప్రస్తుతం అతని వయసు 36 సంవత్సరాలు.
అంటే, రష్మిక-విజయ్ మధ్య వయసు తేడా 7 సంవత్సరాలని స్పష్టమవుతోంది.ఇటీవల 'కింగ్‌డమ్' సినిమాతో అలరించిన విజయ్ దేవరకొండ, త్వరలో రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్ ఈ చిత్రంలో రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో కనిపించనున్నట్లు సమాచారం. ఇక రష్మిక ప్రస్తుతం 'మైసా' చిత్రంలో నటిస్తోంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


