Beetroot Perugu Pachadi :రొటీన్ పచ్చళ్ళతో విసిగిపోయారా.. బీట్ రూట్‌తో టేస్టీ టేస్టీ పెరుగు పచ్చడి తయారు చేసిచూడండి..

Beetroot perugu pachadi
Beetroot Perugu Pachadi :రొటీన్ పచ్చళ్ళతో విసిగిపోయారా.. బీట్ రూట్‌తో టేస్టీ టేస్టీ పెరుగు పచ్చడి తయారు చేసిచూడండి.. మన ఇంట్లో బీట్‌రూట్ అంటేనే ముఖం చిట్లించే వాళ్లు ఎంతో మంది ఉంటారు, ముఖ్యంగా పిల్లలైతే దాని పేరు వినగానే పారిపోతారు. సాధారణ ఫ్రై, కూర చేస్తే రుచి బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. కానీ బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంత గొప్ప మేలు చేస్తుందో అందరికీ తెలుసు కదా!

ఇప్పుడు ఈ బీట్‌రూట్‌తో ఒక్కసారి పెరుగు పచ్చడి చేసి చూడండి… ఒక్కసారి నోట్లో పెట్టగానే బీట్‌రూట్ అంటే ఇష్టం లేని వాళ్లు కూడా ప్లేటంతా ఖాళీ చేసేస్తారు. అంత రుచికరంగా, నోరూరించేలా ఉంటుంది ఈ పచ్చడి. రంగు కూడా అదిరిపోయే పింక్! పిల్లలు రంగుకే ముందు ఆకర్షితులై తినేస్తారు.

కావలసిన పదార్థాలు (2-3 మందికి)
బీట్‌రూట్ - 1 మీడియం సైజు
గట్టిపెరుగు - 1 కప్పు (చిక్కటి పెరుగు తీసుకోండి)
నీళ్లు - ¼ కప్పు
ఉప్పు - రుచికి తగినంత

పేస్ట్ కోసం:
తాజా పచ్చి కొబ్బరి - 3-4 టేబుల్ స్పూన్లు (చిన్న ముక్కలు)
పచ్చిమిర్చి - 3 (మీ మసాలా తగినట్టు)
అల్లం - ½ అంగుళం ముక్క
జీలకర్ర - ½ టీస్పూన్
కరివేపాకు - కొద్దిగా

తాలింపు కోసం:
కొబ్బరి నూనె (లేదా ఏ నూనెయినా) - 2 టీస్పూన్లు
ఆవాలు - ½ టీస్పూన్
ఎండు మిర్చి - 2 (ముక్కలు చేసి)
కరివేపాకు - 1 రెమ్మ

తయారు చేసే విధానం (చాలా సింపుల్!)
బీట్‌రూట్‌ను బాగా కడిగి, పై తొక్క తీసేసి సన్నగా తురుముకోండి.ఒక చిన్న పాన్‌లో తురిమిన బీట్‌రూట్ వేసి, ¼ కప్పు నీళ్లు, చిటికెడు ఉప్పు వేసి మూత పెట్టి సన్న మంట మీద 6-8 నిమిషాలు ఆవిరి పట్టించండి. మెత్తబడితే చాలు, ఎక్కువ ఉడకకుండా చూసుకోండి.

ఈ లోపు మిక్సీలో పచ్చికొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి చాలా తక్కువ నీళ్లతో మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోండి.బీట్‌రూట్ మెత్తబడగానే ఈ కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపి, పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాలు వేయించండి. నీళ్లు పూర్తిగా ఆవిరై, మిశ్రమం దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి.

పూర్తిగా చల్లారాకే గిన్నెలోకి మార్చి, గట్టి పెరుగు వేసి, ఉప్పు సరిచూసుకుని బాగా కలపండి. ఇప్పుడు అందమైన పింక్ రంగు వచ్చేస్తుంది. చివరగా తాలింపు: నూనె వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పె ఆరాకే పచ్చడిలో కలిపేయండి.

అంతే… మీ అద్భుతమైన బీట్‌రూట్ పెరుగు పచ్చడి రెడీ.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అవుతారు. చపాతీ, పుల్కా, దోసె… దేనితోనైనా సూపర్ టేస్ట్. పిల్లలకు రంగురంగుల ఆహారం అంటే ఇష్టం కాబట్టి వీళ్లు ఎగబడి తింటారు.

అలాగే రక్తహీనత (అనీమియా) ఉన్నవాళ్లకు ఇది సూపర్ ఫుడ్. ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక్కసారైనా ఈ పచ్చడి తింటే ఆరోగ్యం గుర్రమైపోతుంది.. తప్పకుండా ట్రై చేసి చూడండి… మీ ఇంట్లో బీట్‌రూట్ ఇకపై ఎవరూ వద్దనరు గ్యారంటీ!

Also read:చామ దుంపలు జిగురుగా ఉంటాయని తినడం మానేస్తున్నారా..? అయితే మీరు ఎంతో మేలు కోల్పోతున్నట్లే!

Also Read:చలికాలంలో కాలి మడమలు పగులుతున్నాయా? ఈ సులువైన ఇంటి చిట్కాలతో త్వరగా దూరం చేయండి!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top