Black Rice Dosa:గుండెను ఉక్కులా మార్చే దోశ..! ఒక్కసారి రుచి చూస్తే రోజూ కావాలనిపిస్తుంది.. లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..బ్లాక్ రైస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, ఆర్థరైటిస్, అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఈ అద్భుతమైన బ్లాక్ రైస్‌తో అన్నం మాత్రమే కాదు, మీ ఇష్టమైన దోశలు కూడా తయారు చేసుకోవచ్చు. బ్లాక్ రైస్ దోశ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూద్దాం...
ప్రస్తుత జీవనశైలి కారణంగా ఊబకాయం సర్వసాధారణమైంది. అధిక బరువు వల్ల కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్ వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు బ్లాక్ రైస్ అద్భుత ఔషధంగా నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్, విటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు వ్యాధులను నిరోధిస్తాయి. గుండె ఆరోగ్యం, మధుమేహం నివారణకు ఉపయోగపడుతుంది.
గుండె ఆరోగ్యానికి డైట్‌లోని ఆహారాలు కీలకం. యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయి. బ్లాక్ రైస్ దోశ దీన్ని నివారిస్తుంది. ఇందులోని ఆంథోసైనిన్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను బలపరుస్తుంది. ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం...
కావాల్సిన పదార్థాలు:
బ్లాక్ రైస్ – 1 కప్పు
మినపప్పు – 1/2 కప్పు
మెంతులు – 1 టీస్పూన్
అటుకులు – అవసరమైనంత
ఉప్పు – రుచికి తగినంత
నెయ్యి – దోశలు వేయడానికి
తయారీ విధానం:
ఒక గిన్నెలో బ్లాక్ రైస్, మినపప్పు, మెంతులు వేసి శుభ్రంగా కడిగి, 8-9 గంటలు నానబెట్టండి.
నానిన తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బుకోండి. అటుకులు వేసి మరోసారి రుబ్బి, సాధారణ దోశ పిండి లాగా తయారు చేయండి.
పిండిని బౌల్‌లోకి తీసుకుని 2 గంటలు పక్కన పెట్టండి.దోశ పెనం వేడి చేసి, నెయ్యి రాసి పిండి పోసి, రెండు వైపులా బంగారు రంగు వచ్చేలా కాల్చండి.ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయండి.
రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే గుండె సమస్యలు, మధుమేహం నుంచి దూరంగా ఉంటారు!


