Chettinad Paneer Curry:చెట్టినాడు స్టైల్ పన్నీర్ కర్రీ – ఘాటైన మసాలా .. రుచి వాసన తోనే నోరూరిస్తుంది.. బగారా రైస్, జీరా రైస్, సాదా బిర్యానీ… ఏది పెట్టినా సూపర్ హిట్. నాన్-వెజ్ ప్రేమికులు కూడా ఈ శాఖాహారీ వెర్షన్ తిని ఫిదా అయిపోతారు!
చెట్టినాడు వంటకాలు అంటేనే ఘాటు, సుగంధం, తాజా మసాలాల మాయ! సాధారణంగా చికెన్-మటన్‌తో చేస్తారు కానీ, ఇదే అద్భుత రుచిని పన్నీర్‌తో తెచ్చిపెట్టే వెర్షన్ ఇది.
కావలసిన పదార్థాలు (4-5 మందికి)
పన్నీర్ – 400 గ్రా (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు – 2 పెద్దవి (సన్నగా తరిగినవి)
టమాటాలు – 3 పెద్దవి (ముక్కలు)
అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు
గసగసాలు (ఖస్‌ఖస్) – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 1 రెబ్బ
కొత్తిమీర – అలంకరణకు
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
నూనె – 6-7 టేబుల్ స్పూన్లు
ఉప్పు – రుచికి తగినంత
ALSO READ:రోజు తింటే రైస్ కి బదులు.. కడుపుకు హాయిగా ఉండే అమృతం లాంటి మిల్లెట్ సాంబార్ రైస్చెట్టినాడు మసాలా కోసం (తాజాగా వేయించి చేసుకోవాలి):
ఎండు మిర్చి – 3-4 (మీ ఘాటు లెవెల్ ప్రకారం)
ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర – 1 టీస్పూన్
మిరియాలు – ½ టీస్పూన్
సోంపు – ½ టేబుల్ స్పూన్
లవంగాలు – 3-4
యాలకులు – 2
దాల్చినచెక్క – 1½ ఇంచ్ ముక్క
రాతిపువ్వు (పత్తర్ కే ఫూల్) – చిన్న ముక్క
జాపత్రి – 1 చిన్న తునక
మరాఠీ మొగ్గ – 1
అనాసపువ్వు (స్టార్ అనీస్) – 1-2
తయారీ విధానం (స్టెప్ బై స్టెప్)
ఒక పాన్‌లో సన్నని మంట మీద అన్ని మసాలా దినుసులు (గసగసాలు తప్ప) వేసి, మంచి సుగంధం వచ్చేవరకు (1-2 నిమిషాలు) వేయించండి. ఎక్కువ వేగిస్తే చేదు వస్తుంది – జాగ్రత్త! చివర్లో గసగసాలు వేసి 10-15 సెకన్లు మాత్రమే చిటపటలాడించి స్టవ్ ఆఫ్ చేయండి. చల్లారాక మిక్సీలో మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
జీడిపప్పు 10 నిమిషాలు నానబెట్టి, టమాటా ముక్కలతో కలిపి స్మూత్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోండి.
కడాయిలో 6-7 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, జీలకర్ర, కరివేపాకు వేసి పేల్చండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేవరకు వేయించండి. అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 30 సెకన్లు వేగించి, టమాటా-జీడిపప్పు పేస్ట్ కలిపి నూనె విడిపోయేవరకు (8-10 నిమిషాలు) బాగా వేయించండి.
ALSO READ:ఇడ్లీ, దోసెలతో అదిరిపోయే కాంబో.. కర్ణాటక స్టైల్ పెరుగు చట్నీ..సూపర్ టేస్టీ..ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసి రెండు నిమిషాలు పైపైన కలుపుతూ వేయించండి (పన్నీర్ రబ్బరు అవ్వకుండా జాగ్రత్త!). తయారుచేసిన చెట్టినాడు మసాలా పౌడర్‌లోంచి 2½-3 టేబుల్ స్పూన్లు వేసి (మిగతాది భద్రపరచుకోండి, ఇంకా చాలా రెసిపీలకు పనికొస్తుంది), ముప్పావు కప్పు నీళ్లు పోసి మరీగేలా చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలే వరకు (5-6 నిమిషాలు) మరిగించండి. గ్రేవీ చిక్కగా ఉండాలి.
చివరగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి, తరిగిన కొత్తిమీర చల్లి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి.అంతే… మతి పోయేలా ఉండే ఘాటైన, సుగంధమైన చెట్టినాడు స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ! బగారా రైస్‌తో పెట్టండి… ఒక్కసారి తిన్నవాడు మళ్లీ మళ్లీ అడుగుతాడు గ్యారంటీ!


