Ragi Dhokla Recipe:రాగిపిండితో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెసిపి... చాలా సులభంగా చేసేయండి..

Ragi Dhokla
Ragi Dhokla Recipe:రాగిపిండితో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెసిపి... చాలా సులభంగా చేసేయండి.. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వంటకం ఢోక్లా. మెత్తని, స్పాంజీ ఆకృతితో, పుల్లని-తీపి రుచుల మిశ్రమంతో ఎవరైనా ఇష్టపడే ఈ డిష్‌ను సాధారణంగా శనగపిండితో చేస్తారు.

కానీ పోషకాల సమృద్ధిగల రాగి పిండితో తయారు చేస్తే? రుచి ఒక ఎత్తు, ఆరోగ్య ప్రయోజనాలు మరో ఎత్తు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఆదర్శవంతమైన ఆహారం.

కావలసిన పదార్థాలు
  • రాగి పిండి – 1 కప్పు
  • బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) – ¼ కప్పు
  • పుల్లటి పెరుగు – ¾ కప్పు
  • అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీస్పూన్
  • ఉప్పు – రుచికి తగినంత
  • పసుపు – చిటికెడు
  • ఈనో ఫ్రూట్ సాల్ట్ – 1 టీస్పూన్ (లేదా ½ టీస్పూన్ బేకింగ్ సోడా)
  • నీరు – సుమారు ½ కప్పు (పిండి కోసం)
  • నూనె – 2 టీస్పూన్లు
  • ఆవాలు – 1 టీస్పూన్
  • జీలకర్ర – ½ టీస్పూన్
  • పచ్చిమిర్చి – 2 (పొడవుగా తరిగినవి)
  • తెల్ల నువ్వులు – 1 టీస్పూన్
  • కరివేపాకు – 2 రెమ్మలు
  • ఇంగువ – చిటికెడు
  • చక్కెర – 1 టీస్పూన్
  • నిమ్మరసం – 1 టీస్పూన్
  • నీరు – 2 టేబుల్ స్పూన్లు (తాలింపు కోసం)
  • కొత్తిమీర, తాజా కొబ్బరి తురుము – అలంకరణ కోసం

తయారీ విధానం
పెద్ద గిన్నెలో రాగి పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, పసుపు వేసి బాగా కలపండి.పెరుగు, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ చేర్చండి. కొద్దికొద్దిగా నీరు పోస్తూ జారుడుగా ఉండేలా పిండి కలపండి. మూత పెట్టి 20-30 నిమిషాలు పక్కన పెట్టండి.

వెడల్పాటి గిన్నెలో/స్టీమర్‌లో నీళ్లు పోసి మరగబెట్టడం మొదలుపెట్టండి. ఢోక్లా ప్లేట్‌కు నూనె రాసి సిద్ధంగా ఉంచండి.పిండిలో ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి, ఒక టీస్పూన్ నీరు చల్లగానే నురగ వస్తుంది. ఒకటి-రెండుసార్లు మెల్లగా కలపండి.
పిండిని నూనె రాసిన ప్లేట్‌లోకి పోసి, మరుగుతున్న స్టీమర్‌లో పెట్టి మూతపెట్టండి. మీడియం మంట మీద 15-20 నిమిషాలు ఉడికించండి.చిన్న పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర పేల్చండి. పచ్చిమిర్చి, కరివేపాకు, నువ్వులు, ఇంగువ వేసి వేయించండి. 

స్టవ్ ఆఫ్ చేసి చక్కెర, నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల నీరు కలిపి పక్కన పెట్టండి.చల్లారిన ఢోక్లాను చతురస్రాలు/డైమండ్ ఆకారాల్లో కట్ చేయండి. తాలింపును సమానంగా పోసి, కొత్తిమీర & కొబ్బరి తురుముతో అలంకరించి వడ్డించండి. రాగి ఢోక్లా – ఆరోగ్యం + రుచి కలిసిన గుజరాతీ డిలైట్..
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top