Table Fan Cleaning Tips:టేబుల్ ఫ్యాన్ శుభ్రం చేయడం ఇంత సులభమా? ఈ చిట్కా తెలుసుకుంటే 5 నిమిషాల్లోనే మెరిసిపోతుంది..ఇల్లు శుభ్రంగా, చక్కగా ఉంటేనే మనసుకు ప్రశాంతత, ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తాయి. వాస్తు ప్రకారం కూడా శుభ్రమైన ఇల్లు లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తుంది. కానీ చాలా మందికి టేబుల్ ఫ్యాన్ శుభ్రం చేయడం అంటే పెద్ద ప్రాబ్లమ్! దుమ్ము పేరుకుపోయి మురికిగా కనిపించడమే కాదు, గాలి కూడా సరిగ్గా రాదు.
అయితే ఇక నుంచి ఆ ఇబ్బంది అవసరం లేదు. ఈ సూపర్ ఈజీ ట్రిక్‌తో 5-10 నిమిషాల్లోనే మీ టేబుల్ ఫ్యాన్ కొత్తది లాగా మెరిసిపోతుంది!
టేబుల్ ఫ్యాన్‌ను శుభ్రంగా మార్చే సులభమైన పద్ధతి:
→ ప్లగ్‌ను స్విచ్ బోర్డు నుండి తప్పకుండా తీసేయండి. గ్రిల్ & బ్లేడ్స్‌ను స్క్రూ డ్రైవర్ సాయంతో సులభంగా ఓపెన్ చేయండి (చాలా ఫ్యాన్స్‌లో ఇది చాలా ఈజీగా వస్తుంది).మోటార్ భాగం & గ్రిల్‌ను తడి గుడ్డతో ముందు తుడవండి.
→ లోపల దుమ్ము ఎక్కువగా ఉంటే పాత టూత్ బ్రష్ లేదా చిన్న బ్రష్‌తో సున్నితంగా శుభ్రం చేయండి.
→ మరింత సులభంగా కావాలంటే వాక్యూమ్ క్లీనర్ (చిన్న నాజిల్ పెట్టి) ఉపయోగించండి – దుమ్ము ఒక్కసారిగా పోతుంది.. బ్లేడ్స్‌ను మైల్డ్ సోప్ నీటిలో ముంచి, స్పాంజ్ లేదా మెత్తని గుడ్డతో తుడిచేయండి. ఒక్కో బ్లేడ్ మధ్యలోని దుమ్మును కూడా మరచిపోకుండా శుభ్రం చేయండి.
అన్ని భాగాలను బాగా ఆరబెట్టండి (తడి ఉంటే త్వరగా మళ్లీ దుమ్ము అంటుకుంటుంది కాబట్టి ఫ్యాన్ పక్కన పెట్టి లేదా గాలి ఉన్న చోట ఆరనివ్వండి).
పూర్తిగా ఆరాక ముందే ఫ్యాన్ ఆన్ చేయొద్దు! ఆరిన తర్వాత గ్రిల్, బ్లేడ్స్‌ను జాగ్రత్తగా తిరిగి ఫిక్స్ చేసి ప్లగ్ పెట్టండి.
అంతే! మీ టేబుల్ ఫ్యాన్ మళ్లీ కొత్తలా లాగా మెరిసిపోతుంది, గాలి కూడా సూపర్ కూల్‌గా వస్తుంది.
ఈ చిన్న చిట్కా ట్రై చేసి చూడండి… ఇక నుంచి టేబుల్ ఫ్యాన్ శుభ్రం చేయడం అంటే మీకు ఆట లాంటిదే!


