Weight Loss Tips:మీ పెళ్లికి సన్నగా, అందంగా కనిపించాలనుకుంటున్నారా? 30 రోజుల్లోనే 4–6 కిలోల వరకు బరువు తగ్గొచ్చు…

Diet Plan
Weight Loss:మీ పెళ్లికి సన్నగా, అందంగా కనిపించాలనుకుంటున్నారా? కేవలం 30 రోజుల్లోనే 4–6 కిలోల వరకు బరువు తగ్గొచ్చు… అది కూడా మ్యాజిక్ లాగా! ఈ ప్లాన్ ఫాలో అయితే బరువు తగ్గడమే కాదు, మీ చర్మం గ్లో అవుతుంది, జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది.

30 రోజుల సూపర్ సింపుల్ రూల్స్
  • ఉదయం 6:30–7:00 లోపు లేవాలి
  • ఖాళీ కడుపుతో 500 ml గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం (లేదా) జీలకర్ర నీళ్లు తాగాలి
  • రోజూ 30–45 నిమిషాలు వ్యాయామం (వాకింగ్, యోగా, స్కిప్పింగ్, జుంబా… ఏదైనా)
  • రాత్రి 7–8 గంటల తప్పనిసరిగా నిద్ర
  • షుగర్, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ పూర్తిగా NO
  • నూనె & అన్నం చాలా తక్కువ… మితంగా మాత్రమే
  • రోజుకి 3–4 లీటర్ల నీళ్లు + గ్రీన్ టీ + కొబ్బరి నీళ్లు
  • రోజువారీ ఫుడ్ ప్లాన్ (సులభంగా ఫాలో చేయొచ్చు)

బ్రేక్‌ఫాస్ట్ (8:00–9:00 am)
  • సోమవారం  → 2 ఇడ్లీ + సాంబార్ + పుదీనా చట్నీ
  • మంగళవారం → వెజ్ సూప్ లేదా రవ్వ కిచిడీ + ఒక పండు
  • బుధవారం  → 1 దోసె + చట్నీ + ఉడికించిన గుడ్డు
  • గురువారం  → ఓట్స్ పాలలో + అర్ధం ఆపిల్
  • శుక్రవారం → ఉప్మా లేదా రాగి జావ
  • శనివారం  → రాగి దోసె + పెరుగు
  • ఆదివారం  → 1 గోధుమ చపాతీ + ఏదో ఒక పండు లేదా ఒక గుడ్డు

మధ్యాహ్నం (12:30–1:30 pm)
  • సోమవారం  → బ్రౌన్ రైస్ + సాంబార్ + పెరుగు
  • మంగళవారం → 2 చపాతీలు + పనీర్/చికెన్ కర్రీ + సలాడ్
  • బుధవారం  → క్వినోవా లేదా బ్రౌన్ రైస్ + రసం + సలాడ్
  • గురువారం  → మిల్లెట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ + గుడ్డు/వెజ్ కర్రీ
  • శుక్రవారం → వెజ్ పులావ్ + దోసకాయ రైతా
  • శనివారం  → 2 గోధుమ రొట్టెలు + పప్పు + వెజ్ సలాడ్
  • ఆదివారం  → చేప/చికెన్ కర్రీ + బ్రౌన్ రైస్ + సలాడ్

సాయంత్రం స్నాక్ (4:30–5:30 pm)
గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ + 10–12 బాదం/వాల్‌నట్స్ లేదా వేయించిన శనగలు లేదా ఒక పండు (బొప్పాయి, జామ, ఆపిల్, నారింజ, దానిమ్మ)

రాత్రి భోజనం (7:00–8:00 pm తర్వాత కాదు!)
  • సోమవారం  → వెజ్ సూప్ + 1 టోస్ట్ బ్రౌన్ బ్రెడ్
  • మంగళవారం → గ్రిల్డ్ చికెన్/పనీర్/టోఫు + ఆవిరి కూరగాయలు
  • బుధవారం  → పెరుగు అన్నం + సలాడ్
  • గురువారం  → పెసర దోసె + పుదీనా చట్నీ
  • శుక్రవారం → ఓట్స్ లేదా ఓట్ మీల్ + ఉడికించిన గుడ్డు
  • శనివారం  → రసం + కొంచెం బ్రౌన్ రైస్ + సలాడ్
  • ఆదివారం  → 1 చపాతీ + పాలకూర/చికెన్ కర్రీ
  • గ్లోయింగ్ స్కిన్ & హెయిర్ బూస్టర్స్
  • సోమవారం & గురువారం → పాలకూర + ఆపిల్ + అర్ద నిమ్మ స్మూతీ
  • బుధవారం → బీట్‌రూట్ + క్యారెట్ + అల్లం జ్యూస్
  • శనివారం → కొబ్బరి నీళ్లు 1 పూర్తి
  • ఆదివారం → తులసి టీ లేదా హెర్బల్ టీ

30 రోజులు ఈ ప్లాన్ స్ట్రిక్ట్‌గా ఫాలో చేస్తే మీ పెళ్లి ఫోటోల్లో మీరే మీకు నచ్చుతారు… గ్యారంటీ! అందరికీ శుభం… మీ డ్రీమ్ వెడ్డింగ్ లుక్ రాబోతోంది! 

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

Also Read:పవర్‌ఫుల్ నేచురల్ ఎనర్జీ డ్రింక్.. రోజూ తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top