Allam murabba:ఖాళీ కడుపుతో చిన్న ముక్క తింటే చాలు .. ఈ వ్యాధులు దూరం.. వర్షాకాలం గడిచిపోయింది. ఇప్పుడు చలికాలం వచ్చేసింది. ఈ సీజన్‌లోనూ సీజనల్ వ్యాధులు ప్రతి ఒక్కరినీ వెంటాడుతూనే ఉంటాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి అప్పుడప్పుడు ఇబ్బంది పెడతాయి.
ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తి చాలా ముఖ్యం. అందుకే అల్లం మురబ్బా ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఇది చాక్లెట్‌లా రుచిగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి మాత్రం దివ్యంగా పనిచేస్తుంది. తిన్న కొద్ది సేపటికే ఫలితం కనిపిస్తుంది.
Also Read:ఈ ఆకును చీప్‌గా చూడొద్దు.. ఈ ఆకు అనేక ఆరోగ్య సమస్యలకు రామబాణం..అల్లం మురబ్బాను బెల్లం, అల్లం మిశ్రమంతో తయారుచేస్తారు. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉంటాయి. దీన్ని తింటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.
అంతేకాకుండా, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చిన్న ముక్క అల్లం మురబ్బా తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు కూడా త్వరగా తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ ప్రభావం నాలుగింతలు ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
షుగర్ ఉన్నవారు జాగ్రత్త.. షుగర్ సమస్య ఉన్నవారు చక్కెరతో చేసిన అల్లం మురబ్బా కాకుండా, బెల్లంతో తయారైనదే తీసుకోవాలి. అయినప్పటికీ మితంగానే సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read:సీతాఫలాలను ఎవరు తినకూడదు, వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి?ప్రయోజనాలు..
గర్భిణులకు వాంతులు, వికారం తగ్గుతాయి.
పిల్లల్లో పైత్యం, కఫం సమస్యలు తొలగుతాయి.
బెల్లంలోని ఐరన్ రక్తాన్ని శుద్ధి చేసి, జీవక్రియను క్రమబద్ధం చేస్తుంది.
మహిళల్లో గర్భాశయ సమస్యల నివారణలో సహకరిస్తుంది.
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
కీళ్ల నొప్పులు, అర్థరైటిస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది – పలు అధ్యయనాలు ధృవీకరిస్తున్నాయి.
చర్మానికి కూడా మేలు చేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


