Black carrot:నల్ల క్యారెట్ తింటే అద్భుత ఆరోగ్య లాభాలు.. ఆ రోగాలన్నీ దూరం..మార్కెట్లో సాధారణంగా ఎర్ర క్యారెట్లే కనిపిస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా నల్ల క్యారెట్ తిన్నారా? అవును, క్యారెట్ నలుపు రంగులోనూ లభిస్తుంది. ఇది ఎర్ర క్యారెట్ కంటే ఎక్కువ పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణలో కూడా ఇవి గణనీయంగా సహాయపడతాయి. మరిన్ని ఆరోగ్య లాభాలు ఇక్కడ చూద్దాం...
అన్ని రకాల క్యారెట్లు పోషకవంతమైనవే. కానీ నల్ల క్యారెట్లలోని ఆంథోసైనిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం. ఎర్ర క్యారెట్లలో విటమిన్ ఎ, విటమిన్ కె1, విటమిన్ బి6, బయోటిన్, ఫైబర్, ప్రోటీన్ మరియు వివిధ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
నల్ల క్యారెట్లలో విటమిన్ ఎ, సి పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులోని ఆంథోసైనిన్ సమ్మేళనం కంటి సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
నల్ల క్యారెట్లు తినడం వల్ల బరువు తగ్గడం సులభమవుతుంది. ఇందులో పోషకాలు అధికంగా ఉండి, కేలరీలు తక్కువగా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అధిక ఫైబర్ ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి.
నల్ల క్యారెట్లలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. కణాలను ఆరోగ్యంగా కాపాడి, దెబ్బతినకుండా రక్షిస్తాయి. దీంతో వృద్ధాప్య లక్షణాలు ఆలస్యమవుతాయని నిపుణులు అంటున్నారు.
నల్ల క్యారెట్లలో ఫైబర్, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్, గుండెల్లో మంట, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


