Black Coffee:ఆయుష్షును పెంచే బ్లాక్ కాఫీ.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. చాలా మంది తమ రోజువారీ జీవితాన్ని ఒక కప్ కాఫీతో ప్రారంభిస్తారు. ఇది ఉదయం ఉత్సాహాన్ని, చైతన్యాన్ని ఇస్తుంది. అన్ని రకాల కాఫీలలో బ్లాక్ కాఫీ అత్యంత ప్రయోజనకరమైనది.
కెఫీన్‌తో పాటు, ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఇతర పోషకాలు ఇందులో ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం, బ్లాక్ కాఫీ తాగడం వల్ల కాలేయంలో కొవ్వు తగ్గుతుంది మరియు కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం బ్లాక్ కాఫీని రోజువారీ అలవాటుగా చేసుకోవచ్చు.
ఒక ప్రముఖ అధ్యయనం ప్రకారం, బ్లాక్ కాఫీ ఆయుష్షును పెంచుతుంది. కాఫీ సేవనం మరియు మరణాల తగ్గుదల మధ్య బలమైన సంబంధం ఉందని కనుగొన్నారు. చక్కెర, పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగేవారిలో మరణ ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
ప్రతిరోజూ 1 నుంచి 2 కప్పుల కెఫీన్ ఉన్న కాఫీ తాగేవారికి అన్ని కారణాల వల్ల మరణ ప్రమాదం, గుండె జబ్బుల వల్ల మరణించే అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే బ్లాక్ కాఫీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు జీవితకాలాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
బ్లాక్ కాఫీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అయితే జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు అధికంగా తాగకూడదు. ఉదయం ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగితే శరీరంలో కొవ్వు కరిగిపోతుంది.
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం బ్లాక్ కాఫీ తాగడం ఉత్తమం. ఇది మెటబాలిజం రేటును పెంచి, కేలరీల ఖర్చును அதிகరిస్తుంది. ఫలితంగా బరువు సులభంగా తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం మంచిది.
బ్లాక్ కాఫీ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. దీంతో శరీరంలో ENergy స్థాయి పెరుగుతుంది. రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. పరిమిత మోతాదులో రోజూ తాగితే హృదయ సమస్యలు రావు. గుండె నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. బ్లాక్ కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడతాయి, చర్మ సమస్యలను నివారిస్తాయి.
బ్లాక్ కాఫీ తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉత్సాహంగా రోజును ప్రారంభించవచ్చు. చికాకు, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఫ్యాటీ లివర్ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. కాలేయ ఆరోగ్యం కోసం బ్లాక్ కాఫీ అద్భుతం. ఉదయం బ్లాక్ కాఫీ తాగితే మెదడు పనితీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మతిమరుపు రాకుండా కాపాడుకోవచ్చు.
(NOTE: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఇక్కడ తెలియజేయబడింది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం)


