Beetroot Leaves:ఈ ఆకులు ఆరోగ్యానికి బంగారం లాంటివి.. లాభాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు.. బీట్‌రూట్ ఆకుల్లో కరిగే, కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ ఆకులు తింటే మంచి గట్ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. జీర్ణక్రియ సమస్యలు రాకుండా చూసుకుంటాయి.
బీట్‌రూట్ ఆకుల్లో ఉండే ఫోలేట్ సంతానోత్పత్తి రేటును పెంచుతుంది. గర్భిణులకు శిశువు ఎదుగుదలలో ఎంతో సహాయపడుతుంది. ఆకుల్లోని నైట్రేట్లు శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచి, రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఈ ఆకులు కంటి ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తాయి. మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండటంతో ఎముకలు బలంగా, ఆరోగ్యంగా మారతాయి. విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్ని కాపాడి, పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలు తగ్గుతాయి.
ఈ ఆకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. తక్కువ తినడంతో బరువు సులువుగా తగ్గుతుంది. సూప్స్, సలాడ్స్ రూపంలో రుచికరంగా తీసుకోవచ్చు.
బీట్‌రూట్ ఆకులు తింటే రక్తహీనత తొలగిపోతుంది. ఇందులోని ఐరన్ హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటంతో రోగనిరోధక శక్తి బలపడుతుంది. వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
మెరిసే చర్మం, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ ఆకులు అద్భుతం. పేస్ట్‌గా చేసి జుట్టుకు రాస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. విటమిన్ బి12 లోపం తొలగి, జుట్టు బలంగా మారుతుంది. కూరగా కూడా రుచికరంగా తినవచ్చు!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


