Sajja Idli:బరువు తగ్గాలనుకునే వాళ్లకి, షుగర్ ఉన్నవాళ్లకి, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్..

Sajja idli
Sajja Idli:బరువు తగ్గాలనుకునే వాళ్లకి, షుగర్ ఉన్నవాళ్లకి, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఎప్పుడూ పూరీ, పరోటా, బోండాలతో రొట్టు కడుపు నింపేస్తున్నామా? రుచి బాగుంటుంది కానీ… నూనె, నెయ్యి, మైదా… ఇవన్నీ కలిసి ఒక్కసారిగా బరువు పెంచేస్తాయి, షుగర్ లెవెల్స్‌ని పైకి లాగేస్తాయి.

ఇక నుంచి ఆ టెన్షన్ అవసరం లేదు! తేలికైన, ఫైబర్‌తో నిండిన, మృదువైన రవ్వ సజ్జ ఇడ్లీ ట్రై చేయండి… ఒక్కసారి తిన్నాక రోజూ చేసుకుంటారు అని గ్యారంటీ!

కావలసిన పదార్థాలు (సుమారు 12-15 ఇడ్లీలు వస్తాయి)
బాంబే రవ్వ (సూజీ) - 1 కప్పు
సజ్జ పిండి (బజ్రా ఫ్లోర్) - ½ కప్పు
పుల్లటి పెరుగు - 1 కప్పు
నీళ్లు - అవసరమైనంత (సుమారు ¼ - ½ కప్పు)
వంట సోడా (లేదా ఈనో) - ½ టీస్పూన్
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - ½ టీస్పూన్
పచ్చిమిర్చి (సన్నగా తరిగినది) - 2
కరివేపాకు - 8-10 ఆకులు
ఉప్పు - రుచికి తగినంత
ALSO READ:కేవలం 15 నిమిషాల్లో ఇంట్లోనే సూపర్ టేస్టీ ఎగ్ పిజ్జా!.. రుచి అదిరిపోద్ది!!
సులభమైన తయారీ విధానం (కేవలం 30 నిమిషాల్లో రెడీ!)
ముందుగా ఒక పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వండి.అదే పాన్‌లో 1 కప్పు రవ్వ + ½ కప్పు సజ్జ పిండి వేసి, చిన్న మంట మీద 5-6 నిమిషాలు కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా వేయించండి.

స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి.చల్లారాక ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని, 1 కప్పు పుల్లటి పెరుగు + ఉప్పు + కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపండి. పిండి ఇడ్లీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి.

మూత పెట్టి 20 నిమిషాలు పక్కన పెట్టండి (ఈ టైంలో రవ్వ బాగా నానుతుంది).ఇడ్లీలు వేయడానికి ముందు మాత్రమే ½ టీస్పూన్ వంట సోడా వేసి, దానిపై కొద్దిగా నీళ్లు చల్లి మెల్లగా కలపండి (పిండి బుడగలు వస్తాయి).ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి పిండి పోసి, ఆవిరిపై 10-12 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించండి.

రెండు నిమిషాలు ఆగి తీస్తే… మెత్తని, స్పాంజీ రవ్వ సజ్జ ఇడ్లీలు రెడీ!వేడి వేడిగా కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, సాంబార్ లేదా అల్లం పచ్చడితో సర్వ్ చేయండి… రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది! ఆరోగ్యం + రుచి రెండూ ఒకేసారి కావాలా? అయితే ఈ రవ్వ సజ్జ ఇడ్లీ మీ ఫేవరెట్ అవుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top