Dry Fruits for Weight Loss:బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 4 డ్రై ఫ్రూట్స్‌ను అలవాటు చేసుకోండి..పలితం మాత్రం పక్కా..
బరువు తగ్గాలంటే అతి పెద్ద శత్రువు… పదే పదే వచ్చే ఆకలి! ఈ ఆకలిని అదుపు చేయడమే కీలకం. అక్కడే డ్రై ఫ్రూట్స్ మ్యాజిక్ చేస్తాయి. కేలరీలు కొంచెం ఎక్కువగా ఉన్నా… వీటిలోని ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపుని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. ఫలితంగా ఓవర్‌ఈటింగ్ ఆగిపోతుంది.
ALSO READ:రాత్రి మిగిలిన అన్నం... సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ట్రై చేయండి..జెన్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ డైటీషియన్ ప్రియా పాలన్ గారు ఇలా అంటున్నారు – “డ్రై ఫ్రూట్స్ కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, మొత్తం మెటబాలిక్ ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తాయి.”
అయితే… బరువు తగ్గడానికి అత్యంత ప్రభావవంతమైన 4 డ్రై ఫ్రూట్స్ ఏమిటో తెలుసుకుందాం?
1. బాదం (Almonds)
అత్యధిక మెగ్నీషియం, విటమిన్ E, ప్లాంట్ ప్రోటీన్ ఉన్న సూపర్ నట్..ఫైబర్ + హెల్దీ ఫ్యాట్స్ వల్ల గంటల తరబడి ఆకలి అణచివేస్తుంది. జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ సైన్సెస్ అధ్యయనం ప్రకారం → రోజూ బాదం తినేవారి బరువు ఎక్కువగా తగ్గింది
👉 సిఫార్సు: రోజూ 4–5 బాదంపాటి మాత్రమే చాలు
2. ఆక్రోట్ (Walnuts)
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌లో నంబర్-1..శరీరంలో వాపులు తగ్గిస్తాయి, మెదడు పనితీరు పెంచుతాయి. కేలరీలు ఎక్కువే అయినా… నియంత్రిత మోతాదులో తీసుకుంటే ఆకలి దూరంగా ఉంటుంది.
👉 రోజూ 2–3 ముక్కలు (సగం ఆక్రోట్) సరిపోతుంది
3. వేరుశెనగ (Peanuts) – “పేదవాడి బాదం”
ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ పుష్కలం & చవకగా దొరుకుతాయి.రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచి ఆకలిని నియంత్రిస్తాయి.న్యూట్రిషన్ జర్నల్ పరిశోధన → భోజనానికి 30–35 గ్రాముల వేరుశెనగ తింటే బరువు త్గ్గడం సులువవుతుంది
👉 ఉడకబెట్టిన లేదా కాల్చిన వేరుశెనగనే ఎంచుకోండి (ఉప్పు లేకుండా)
ALSO READ:పీకన్ నట్స్ ని తినకపోతే ఈ లాభాలను కోల్పోయినట్టే.4. ఖర్జూరం (Dates)
సహజ చక్కెర, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్‌తో నిండి ఉంటాయి.మిఠాయి తినాలనిపించినప్పుడు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.తక్కువ లైసెమిక్ ఇండెక్స్ వల్ల చక్కెర స్పైక్ రాకుండా శక్తిని ఇస్తాయి .
👉 రోజూ 2–3 ఖర్జూరాలు తింటే స్వీట్ క్రేవింగ్స్ పోతాయి
గమనిక: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివే. కానీ “పరిమాణం” చాలా ముఖ్యం. ఎక్కువ తింటే కేలరీలు పెరిగి బరువు పెరుగుతుంది. అందుకే నియంత్రిత మోతాదులోనే తీసుకోండి మరియు మీ శరీరానికి తగ్గట్టు డైటీషియన్‌ను సంప్రదించడం ఉత్తమం.
ఈ చిన్న మార్పు పెద్ద ఫలితం ఇస్తుంది… ఇవాళ్టి నుంచే మొదలెట్టండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


