Leftover Rice:రాత్రి మిగిలిన అన్నం... ఉదయాన్నే తింటే ఏమవుతుంది? చాలా మంది ఇప్పుడు “ఫర్మెంటెడ్ రైస్” అని పిలుస్తున్న ఈ చద్దన్నం నిజంగా అద్భుతమే!
ఇంట్లో రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని చూస్తే చాలా మంది ముక్కు మూసుకొని “పాత అన్నం” అని పారేసేస్తారు. కానీ మన పూర్వీకులు మాత్రం దీన్నే ఉదయపు బ్రేక్‌ఫాస్ట్‌గా గొప్పగా తినేవారు. ఇడ్లీ-దోసె-బ్రెడ్-కార్న్‌ఫ్లెక్స్ లాంటివి ఏమీ లేని రోజుల్లో వాళ్లకి ఈ చద్దన్నమే ప్రధాన ఆహారం. ఫలితం? 70-80 ఏళ్ల వయసులో కూడా ఎనర్జీతో ఉండేవారు, చిన్న చిన్న అనారోగ్యాలు కూడా రావు.
ఇప్పుడు మనం 30 ఏళ్లు దాటగానే షుగర్, బీపీ, జీర్ణసమస్యలు, అలసట... జాబితా పెద్దదవుతోంది. ఇందులో ఆహారపు అలవాట్లది చాలా పెద్ద పాత్ర ఉంది.
అసలు ఈ చద్దన్నం అంటే ఏమిటి?
రాత్రి మిగిలిన అన్నాన్ని ఒక గిన్నెలో వేసి, దానికి సరిపడా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టడం. ఉదయానికి అది సహజంగా కిణ్వ ప్రక్రియ (fermentation) జరిగి “ఫర్మెంటెడ్ రైస్” అవుతుంది. ఇందులో ఒక చెంచా పెరుగు లేదా మజ్జిగ కలిపి, కొంచెం ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని తింటే... స్వర్గం లాంటి రుచి + అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!
ALSO READ:ఇవి తింటే.. మంచి కొలెస్ట్రాల్ పెరగమే కాదు, గుండెకు కూడా మంచిదిశాస్త్రీయంగా ఏం జరుగుతుంది?
రాత్రి నానబెట్టడంతో అన్నంలోని స్టార్చ్ సహజంగా విచ్ఛిన్నమై “రెసిస్టెంట్ స్టార్చ్”గా మారుతుంది. ఇది ప్రీ-బయోటిక్ లాగా పనిచేసి మంచి గట్ బ్యాక్టీరియాను పెంచుతుంది. అలాగే విటమిన్ B కాంప్లెక్స్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫైబర్ శాతం బాగా పెరుగుతుంది.
రోజూ ఉదయం చద్దన్నం తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు:
జీర్ణక్రియ దివ్యంగా మెరుగుపడుతుంది – మలబద్ధకం, గ్యాస్, యాసిడిటీ, అజీర్తి దూరంగా పరుగులు పెడతాయి.గట్‌లో మంచి బ్యాక్టీరియా పెరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
రెసిస్టెంట్ స్టార్చ్ వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు స్లోగా పెరుగుతాయి – డయాబెటిస్ ఉన్నవారికి చాలా మేలు (కానీ డాక్టర్ సలహా తర్వాతే).పొటాషియం ఎక్కువగా ఉండటంతో బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది.
ALSO READ:పీకన్ నట్స్ ని తినకపోతే ఈ లాభాలను కోల్పోయినట్టే..శరీరంలో నీటి శాతం సమతుల్యంగా ఉంటుంది – డీహైడ్రేషన్ రాదు.రోజంతా ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి, అలసట అనేదే ఉండదు. ఒంట్లో వేడి (heat) తగ్గుతుంది – ముఖ్యంగా వేసవిలో ఎంతో ఉపశమనం.
ఎలా తినాలి?
ఉదయం ఖాళీ కడుపుతోనే తినడం బెస్ట్.పెరుగు లేదా మజ్జిగ + కొద్దిగా ఉప్పు తప్పనిసరి. ఇష్టమైతే చిన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం కలిపి “చద్దన్నాం పొంగలి” లాగా తినొచ్చు.రుచికరంగా కావాలంటే కొద్దిగా ఆవకాయ లేదా నిమ్మకాయ ఊరగాయ కలిపినా సూపర్!
ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
డయాబెటిస్ బాగా ఎక్కువగా ఉన్నవారు
కిడ్నీ సమస్యలు ఉన్నవారు (పొటాషియం ఎక్కువ)
చలికాలంలో ఎక్కువగా తింటే కొందరికి జలుబు అవుతుంది (అందుకే కొద్దిగా అల్లం రసం కలిపి తినొచ్చు)
మీరు కూడా రేపటి నుంచి ఈ సింపుల్, చవకైన, సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ట్రై చేయండి. ఒక్క వారంలోనే మీ శరీరం తేడా చూపిస్తుంది!


