Weight Loss Tips: 30 రోజులు చియా సీడ్స్ + నిమ్మరసం డ్రింక్ తాగితే కనిపించే అద్భుతమైన మార్పులు..చియా గింజలు (చియా సీడ్స్) మరియు నిమ్మరసం కలిపి తయారుచేసిన సింపుల డ్రింక్ ఇప్పుడు అందరి ఫేవరెట్ అయిపోతోంది.
రాత్రి నానబెట్టిన చియా గింజల్లో ఉదయాన్ని సగం నిమ్మకాయ రసం పిండి, ఖాళీ కడుపున తాగితే… వారం రోజుల్లోనే శరీరంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ డ్రింక్ రోజూ తాగితే ఏం జరుగుతుంది?
బరువు వేగంగా తగ్గుతుంది చియా గింజలు నీటిని పీల్చుకుని 10–12 రెట్లు ఉబ్బుతాయి. కడుపు ఎక్కువ సేపు నిండుగా అనిపించి, అనవసరంగా తినే అలవాటు తగ్గుతుంది. ఫలితం – కేలరీలు తగ్గి, బరువు సులువుగా తగ్గుతుంది.
డీహైడ్రేషన్‌కు చెక్ చియా గింజలు నీటిని గట్టిగా పట్టుకుంటాయి. ఉదయాన్ని ఈ డ్రింక్ తాగితే రోజంతా శరీరంలో నీటి శాతం స్థిరంగా ఉంటుంది. బయట ఎక్కువగా తిరిగే వాళ్లకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ALSO READ:కేవలం 10 నిమిషాలలో అప్పటికప్పుడు సులభంగా చేసుకొనే బ్రేక్ ఫాస్ట్గుండె ఆరోగ్యం మెరుగవుతుంది చియా సీడ్స్‌లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, క్వెర్సెటిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
జీర్ణక్రియ మెరుగవుతుంది – మలబద్ధకం పరారి చియా గింజల్లో ఉండే అధిక ఫైబర్ (35–40%) పేగు కదలికలను సులువు చేస్తుంది. రోజూ ఉదయం ఈ డ్రింక్ తాగితే సుఖ విరేచనాలు అవుతాయి, గ్యాస్-బ్లోటింగ్-మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.
రక్తపోటు (BP) నియంత్రణలోకి వస్తుంది పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండటంతో ఈ డ్రింక్ హై బీపీ ఉన్నవారికి చక్కటి all-natural సొల్యూషన్‌గా పనిచేస్తుంది.
జీరో క్యాలరీ – బరువు తగ్గే వాళ్లకు బెస్ట్ ఈ డ్రింక్‌లో కేలరీలు దాదాపు సున్నా! కాబట్టి డైట్‌లో భాగంగా ఎంత తాగినా బరువు పెరగదు.
సులభమైన తయారు విధానం
రాత్రి 1–2 టీస్పూన్ల చియా గింజలు ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టండి.ఉదయాన్ని సగం నిమ్మకాయ రసం పిండండి (అవసరమైతే కాస్త తేనె కలపొచ్చు).బాగా కలిపి ఖాళీ కడుపున తాగండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


