Fermented Rice:రోజూ చద్దన్నం తింటున్నారా.. వందల రోగాలని నయం చేసే అన్నం.. చద్దన్నం… ఒకప్పుడు “మిగిలిపోయిన అన్నం” అని తోసిపుచ్చిన ఆహారం. కానీ మన పూర్వీకులు ఉదయాన్నే దీన్నే టిఫిన్‌గా తిని, ఉత్సాహంగా పొలం పనులు చేసుకుని వచ్చేవారు. ఇప్పుడు సైన్స్‌స్ కూడా చెబుతోంది – చద్దన్నం నిజంగానే అమృతం లాంటిదని!
పల్లెటూర్లలో ఇప్పటికీ కొందరు ఉదయం పూట పెరుగు చద్దన్నం, ఉల్లిపాయ కారం, పచ్చడితో తింటూనే ఉన్నారు. నగరాల్లోనూ ఆరోగ్య ప్రయోజనాలు తెలిసాక యువత మళ్లీ దీని వైపు చూస్తున్నారు.
చద్దన్నం వల్ల కలిగే ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు:
సహజ ప్రోబయాటిక్ ఫుడ్ రాత్రి నానబెట్టి పులియబెట్టిన అన్నంలో లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా పెరిగి గట్ హెల్త్‌ను కాపాడతాయి. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
శరీరానికి చల్లదనం వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, డీహైడ్రేషన్‌ను అడ్డుకుంటుంది. హీట్ స్ట్రోక్ రిస్క్ తక్కువ.
ALSO READ:30 రోజులు చియా సీడ్స్ + నిమ్మరసం డ్రింక్ తాగితే కనిపించే అద్భుతమైన మార్పులు..పోషకాలు సులభంగా లభిస్తాయి పులియడం వల్ల ఐరన్, జింక్, విటమిన్ B-కాంప్లెక్స్ (ముఖ్యంగా B12) శరీరానికి ఈజీగా అందుతాయి. రోజంతా ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి.
కొలెస్ట్రాల్ కంట్రోల్ ఫెర్మెంటేషన్ వల్ల ఏర్పడే కొన్ని కాంపౌండ్స్ LDL (బ్యాడ్ కొలెస్ట్రాల్) తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది సహజ యాంటీఆక్సిడెంట్స్, తేలికపాటి యాసిడిటీ వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ సులువుగా రావు.
డయాబెటిస్ ఉన్నవారికి సేఫ్ పులిసిన అన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు.
తక్కువ ఖర్చు – ఎక్కువ లాభం ఇంట్లోనే రోజూ మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌ట్రా ఖర్చు లేకుండా సూపర్ హెల్తీ ఆహారం!
మన అమ్మమ్మలు-నానమ్మలు ఏదో టైం లేక చేసిన పని కాదు… వాళ్లకు సహజంగానే తెలిసపోయింది – చద్దన్నం ఆరోగ్య భాండాగారమని. ఇప్పుడు మనం కూడా ఆ జ్ఞానాన్ని మళ్లీ స్వీకరిద్దాం!
ప్రతిరోజూ ఒకసారైనా పెరుగు చద్దన్నం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఏదైనా పచ్చడితో ట్రై చేయండి… ఒక వారంలోనే కడుపు తేలిక, శరీరం ఫ్రెష్‌గా అనిపిస్తుంది.ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది… చద్దన్నంతో మొదలెట్టండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


