Srisailam Temple: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి భక్తులకు సూపర్ గుడ్ న్యూస్..శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులకు ఆలయ దేవస్థానం నుంచి తీపికబురు అందింది.
భక్తుల సౌకర్యం కోసం శనివారం, ఆదివారం, సోమవారాల్లో స్పర్శ దర్శన సమయాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పులు 2026 జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. భక్తుల విజ్ఞప్తుల మేరకు ఆలయ ఈవో శ్రీనివాసరావు గారు ఈ నిర్ణయం ప్రకటించారు.
వారాంతాల్లో భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు మొత్తం ఆరు స్లాట్లలో స్పర్శ దర్శనం అందుబాటులో ఉంటుంది. కొత్త షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి:
ALSO READ:పంచదార లేకుండా సూపర్ టేస్టీ నల్ల నువ్వుల లడ్డూలు – పాకం పట్టకుండా, నిమిషాల్లో రెడీ..ఉదయం 6:00 గంటల నుంచి 7:00 గంటల వరకు – వీఐపీ బ్రేక్ దర్శనం
ఉదయం 7:00 గంటల నుంచి 8:30 గంటల వరకు – స్పర్శ దర్శనం
ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు – వీఐపీ బ్రేక్ దర్శనం
ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు – స్పర్శ దర్శనం
సాయంత్రం 7:45 నుంచి 8:00 గంటల వరకు – వీఐపీ బ్రేక్ దర్శనం
రాత్రి 9:00 నుంచి 11:00 గంటల వరకు – స్పర్శ దర్శనం
భక్తులు స్పర్శ దర్శన టికెట్లను www.aptemples.ap.gov.in లేదా www.srisailadevasthanam.org వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 ద్వారా కూడా బుకింగ్ సౌకర్యం ఉంది.
ఇక రూ.150తో శీఘ్ర దర్శనం, రూ.300తో అతి శీఘ్ర దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌తో పాటు కౌంటర్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఆలయంలో 14 రకాల సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ALSO READ:రాగి పిండితో సూపర్ హెల్దీ స్నాక్ & టిఫిన్ – రెండు రకాల అల్పాహారాలు ఒకే రెసిపీతో..ఈ మార్పులతో శ్రీశైలంలో స్వామివారి దర్శనం మరింత సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుందని దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


