Grapes:ఎరుపు, నలుపు, ఆకుపచ్చ.. ఏ రంగు ద్రాక్ష తింటే ఎక్కువ బలం? అసలు నిజం ఇదే!

Grapes
Grapes:ఎరుపు, నలుపు, ఆకుపచ్చ.. ఏ రంగు ద్రాక్ష తింటే ఎక్కువ బలం? అసలు నిజం ఇదే... మార్కెట్‌కి వెళ్తే మనకు ఆకుపచ్చ (Green), నలుపు (Black), ఎరుపు (Red) రంగుల్లో ద్రాక్షలు కనిపిస్తాయి. 

చూడటానికి రంగులు వేరైనా, అన్నింటిలోనూ ఒకే రకమైన పోషకాలు ఉంటాయా? లేక రంగును బట్టి మారుతాయా? ఏది తింటే మనకు ఎక్కువ ఆరోగ్యం? అనే సందేహం చాలా మందికి వస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1. నలుపు మరియు ఎరుపు ద్రాక్ష (Red & Black Grapes)
ఈ రంగు ద్రాక్షల్లో ఒక స్పెషల్ పవర్ ఉంది. వీటిలో 'రెస్వెరాట్రాల్' (Resveratrol) అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది.

క్యాన్సర్ ఫైటర్: ఇది క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. ముఖ్యంగా పెద్ద ప్రేగుల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా రక్షించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

2. ఆకుపచ్చ ద్రాక్ష (Green Grapes)
మరి ఆకుపచ్చ ద్రాక్షలో ఏముంటుంది? వీటిలో 'ఫ్లేవనాయిడ్లు' (Flavonoids) అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కూడా ఎర్ర ద్రాక్షలో ఉండే పోషకాలకు ఏమాత్రం తీసిపోవు. శరీరానికి కావలసిన శక్తిని ఇవి పుష్కలంగా అందిస్తాయి.

కామన్ పాయింట్స్ (అన్నింటిలో ఉండేవి):

ఏ రంగు ద్రాక్ష తీసుకున్నా ఈ క్రింది పోషకాలు కామన్:

విటమిన్-కె (Vitamin K): రక్తం గడ్డకట్టడానికి, ఎముకలు బలంగా ఉండటానికి ఇది ముఖ్యం.

విటమిన్-బి6 (Vitamin B6): మన మూడ్ (Mood) బాగుండటానికి, మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది.

తక్కువ క్యాలరీలు: 100 గ్రాముల ద్రాక్ష తింటే కేవలం 80 క్యాలరీలు మాత్రమే వస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి స్నాక్.

షుగర్ పేషెంట్లు తినొచ్చా?
ద్రాక్ష తియ్యగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్లు భయపడతారు. కానీ, ఇతర పండ్లతో పోల్చితే ఇందులో చక్కెర ఎక్కువే ఉన్నా.. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ (GI) తక్కువ నుండి మధ్యస్థంగా ఉంటుంది. కాబట్టి మధుమేహ రోగులు వీటిని తక్కువ మొత్తంలో (Limit) నిరభ్యంతరంగా తినవచ్చు.

జ్యూస్ చేస్తున్నారా? వద్దు!
ద్రాక్ష అందించే పూర్తి లాభాలు కావాలంటే వాటిని పండుగానే తినాలి.జ్యూస్ చేయడం వల్ల అందులో ఉండే పీచు పదార్థం (Fiber) పోతుంది.పైగా జ్యూస్‌లో పంచదార కలిపితే.. ద్రాక్ష వల్ల వచ్చే లాభాల కంటే నష్టమే ఎక్కువ.కాబట్టి కడిగి శుభ్రం చేసుకుని నేరుగా తినడమే ఉత్తమం.

మీకు నలుపు ద్రాక్ష ఇష్టమా? ఆకుపచ్చ ఇష్టమా? ఏది తిన్నా పర్లేదు.. రంగు ఏదైనా ద్రాక్ష పండు మన గుండెకు, ఆరోగ్యానికి చేసే మేలు మాత్రం చాలా ఎక్కువ!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

ALSO READ:బీట్‌రూట్ జ్యూస్ తాగాలా? ముక్కలుగా తినాలా? ఏది తింటే రక్తం త్వరగా పడుతుంది? నిజాలు ఇవే!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top