Leftover Rice:రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. 10 నిమిషాల్లో ఇలా 'క్రిస్పీ పునుగులు' వేసుకోండి... ప్రతి ఇంట్లో అన్నం మిగిలిపోవడం కామన్. దాన్ని పారేయలేక, ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. దానికి "క్రిస్పీ సొల్యూషన్" ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి వండిన అన్నం మిగిలిపోతే ఉదయం తినబుద్ధి కాదు. అలాగని పారేయలేము. కానీ ఆ అన్నంతోనే రోడ్డు పక్కన బండి మీద దొరికేలాంటి కరకరలాడే పునుగులు వేసుకోవచ్చు.
ఎలా చేయాలి?
మిగిలిన అన్నాన్ని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.అందులో రెండు స్పూన్ల బియ్యం పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర కలపాలి.నీళ్లు పోయకుండా గట్టిగా కలుపుకుని, వేడి నూనెలో చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి.
రుచి: ఇవి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. వేడి వేడి టీతో తింటే అద్భుతంగా ఉంటాయి.


