Oats Gunta Ponganalu:ఇడ్లీ పిండి లేదని టెన్షన్ పడుతున్నారా? కప్పు ఓట్స్ ఉంటే చాలు.. 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ..
ఆరోగ్యం కోసం ఓట్స్ (Oats) తినాలి అనుకుంటాం.. కానీ ఆ జావ తాగలేక మానేస్తాం. కానీ ఓట్స్ తో ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే గుంత పొంగనాలు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇది వెయిట్ లాస్ కి బెస్ట్, రుచికి అద్భుతం.
కావాల్సిన పదార్థాలు:
ఓట్స్ - 1 కప్పు (పౌడర్ చేసుకోవాలి)
బాంంబే రవ్వ (Suji) - అర కప్పు (క్రిస్పీనెస్ కోసం)
పెరుగు - అర కప్పు
ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము - తగినంత
వంట సోడా - చిటికెడు (గుల్లగా రావడానికి)
ఉప్పు, కొత్తిమీర - రుచికి సరిపడా
తయారీ విధానం (Step-by-Step):
ముందుగా ఒక కప్పు ఓట్స్ ను మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ లా చేసుకోవాలి.ఒక గిన్నెలో ఓట్స్ పౌడర్, బాంంబే రవ్వ, పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇందులో కొంచెం నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి.
రవ్వ నానేందుకు ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, చిటికెడు వంట సోడా వేసి బాగా కలపాలి.
స్టవ్ మీద పొంగనాల పాన్ పెట్టి, కొంచెం ఆయిల్ రాసి, గుంతల్లో పిండి వేయాలి. మూత పెట్టి సన్నని మంటపై రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
హెల్త్ బెనిఫిట్స్:
బరువు తగ్గుతారు: ఓట్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, త్వరగా ఆకలి వేయదు.
ఇన్స్టంట్ ఎనర్జీ: ఉదయాన్నే ఇది తింటే రోజంతా యాక్టివ్ గా ఉంటారు.
పిల్లలకు బలం: ఇందులో రకరకాల కూరగాయలు వేస్తాం కాబట్టి పిల్లలకు తెలియకుండానే పోషకాలు అందుతాయి.
కాంబినేషన్: దీనిలోకి పల్లి చట్నీ (Peanut Chutney) లేదా అల్లం పచ్చడి అద్భుతంగా ఉంటుంది. వేడి వేడిగా తింటే ఆ రుచే వేరు!

