Potato Rice:చాలా ఈజీగా10 నిమిషాల్లో చేసే లంచ్ బాక్స్ రెసిపీ.. తిన్న ఎవ్వరైనా సూపర్ అనాల్సిందే..

Potato rice
Potato Rice:చాలా ఈజీగా10 నిమిషాల్లో చేసే లంచ్ బాక్స్ రెసిపీ.. తిన్న ఎవ్వరైనా సూపర్ అనాల్సిందే.. బంగాళదుంప రైస్ అంటే సింపుల్‌గా, రుచికరంగా ఉండే వెరైటీ రైస్! పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే డిష్. లంచ్ బాక్స్‌కి పర్ఫెక్ట్, మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. చల్లారినా రుచిగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు:
అన్నం: 2 కప్పులు
బంగాళదుంపలు: 2
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి: 2-3
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
నూనె/నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
కారం: 1 టీస్పూన్
గరం మసాలా: ½ టీస్పూన్
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: కొద్దిగా
ఆవాలు: ½ టీస్పూన్
జీలకర్ర: ½ టీస్పూన్
శనగపప్పు/మినపప్పు: 1 టీస్పూన్
ఎండుమిర్చి: 1-2
కరివేపాకు: 1 రెమ్మ
ఇంగువ: చిటికెడు (ఆప్షనల్)

తయారీ విధానం :
కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసి వేయించాలి.సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

ఇప్పుడు చిన్నగా కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసి కలపాలి.మూత పెట్టి సన్నని మంటపై ముక్కలు మెత్తగా ఉడికే వరకు మగ్గనివ్వాలి (ముక్కలు చిన్నగా ఉంటే త్వరగా వేగుతాయి మరియు రుచిగా ఉంటాయి).

బంగాళదుంప ముక్కలు బాగా వేగి, మెత్తబడ్డాక.. కారం, గరం మసాలా (లేదా బిర్యానీ మసాలా) వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి, మిగిలిన ఉప్పు కూడా వేసి, అన్నం విరగకుండా మెల్లగా కలపాలి.

మసాలా అంతా అన్నానికి పట్టేలా 2 నిమిషాలు సన్నని మంటపై ఉంచాలి.చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయాలి.అంతే! వేడి వేడి బంగాళదుంప రైస్ రెడీ.
ALSO Read:పిస్తా ప‌ప్పును రోజూ తింటున్నారా.. రోజుకి ఎన్ని తినాలో తెలుసా..
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top