SBI RD Scheme:పేదవాడికి ఎస్‌బీఐ వరం! నెలకు రూ.100 కడితే చాలు.. వడ్డీతో సహా చేతికి ఎంతొస్తుందంటే?

SBI RD Scheme
SBI RD Scheme:పేదవాడికి ఎస్‌బీఐ వరం! నెలకు రూ.100 కడితే చాలు.. వడ్డీతో సహా చేతికి ఎంతొస్తుందంటే?

రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బును బీరువాలోనో, పోపుల డబ్బాలోనో దాస్తున్నారా? అలా చేస్తే డబ్బు పెరగదు సరికదా.. దొంగతనం జరిగే రిస్క్ ఉంది.

అందుకే సామాన్యుల కోసం, రోజువారీ కూలీల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఒక అదిరిపోయే స్కీమ్ తీసుకొచ్చింది. ఇందులో మీరు పెద్ద మొత్తంలో డబ్బులు కట్టక్కర్లేదు. కేవలం రూ.100 తో కూడా పొదుపు మొదలుపెట్టొచ్చు. అదే "SBI రికరింగ్ డిపాజిట్ (RD)".

ఎవరికి ఈ స్కీమ్? ఎలా చేరాలి?
రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు ఎవరైనా ఈ ఖాతా తెరవొచ్చు.దేశంలోని ఏ SBI బ్రాంచ్ లో అయినా ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.

కనీస పెట్టుబడి: నెలకు కేవలం రూ. 100 మాత్రమే. ఆ పైన ఎంతైనా కట్టుకోవచ్చు.

కాలపరిమితి: కనీసం 12 నెలల నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు పొదుపు చేయవచ్చు.

వడ్డీ ఎంత? లాభం ఎలా ఉంటుంది?
సాధారణ పొదుపు ఖాతా కంటే ఇందులో వడ్డీ ఎక్కువ.
వడ్డీ రేటు: ప్రస్తుతం 5 ఏళ్ల ప్లాన్ కి 6.50% వడ్డీ ఇస్తున్నారు.
సీనియర్ సిటిజన్స్: 60 ఏళ్లు దాటిన వారికి 7% వడ్డీ లభిస్తుంది.

నెలకు ఎంత కడితే.. చేతికి ఎంతొస్తుంది? (5 ఏళ్లకు)
మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని 5 సంవత్సరాల పాటు కడితే.. చివర్లో ఎంత వస్తుందో చూద్దాం.

నెలకు రూ.100 చొప్పున:
మీరు కట్టేది: రూ. 6,000
వచ్చే వడ్డీ: రూ. 1,106
చేతికి వచ్చే మొత్తం: రూ. 7,106

నెలకు రూ.500 చొప్పున:
మీరు కట్టేది: రూ. 30,000
వచ్చే వడ్డీ: రూ. 5,528
చేతికి వచ్చే మొత్తం: రూ. 35,528

నెలకు రూ.1000 చొప్పున:
మీరు కట్టేది: రూ. 60,000
చేతికి వచ్చే మొత్తం: రూ. 71,057

ముఖ్య గమనిక: ప్రతి నెలా టైమ్ కి డబ్బులు కట్టాలి. లేకపోతే పెనాల్టీ పడుతుంది. వరుసగా 6 నెలలు కట్టకపోతే అకౌంట్ క్లోజ్ చేస్తారు. కాబట్టి జాగ్రత్త!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

ALSO READ:గడ్డి పోచ అని తీసిపారేయకండి.. ఇది పెద్ద రోగాలకు 'సంజీవని'! రోజూ ఈ టీ తాగితే చాలు..
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top