White Bread Vs Brown Bread:బ్రౌన్ బ్రెడ్ తింటున్నారా? అయితే మీరు మోసపోతున్నట్లే.. డాక్టర్లు చెప్పిన షాకింగ్ నిజం ఇదే..
బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ పేషెంట్లు ముందుగా చేసే పని.. వైట్ బ్రెడ్ మానేసి బ్రౌన్ బ్రెడ్ తినడం. బ్రౌన్ బ్రెడ్ అంటే గోధుమలతో చేస్తారు, అది ఆరోగ్యానికి మంచిదని మన నమ్మకం. కానీ, మార్కెట్లో దొరికే చాలా రకాల బ్రౌన్ బ్రెడ్స్ నకిలీవని, అవి తినడం కంటే వైట్ బ్రెడ్ తినడమే నయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలు నిజం ఏంటి?
వైట్ బ్రెడ్: ఇది పూర్తిగా మైదా (Refined Flour)తో తయారవుతుంది. ఇందులో ఫైబర్ ఉండదు, పోషకాలు తక్కువ.
బ్రౌన్ బ్రెడ్ (అసలైనది): ఇది పొట్టు తీయని గోధుమ పిండి (Whole Wheat)తో తయారవ్వాలి. ఇందులో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
ఇక్కడే జరుగుతోంది మోసం: మార్కెట్లో దొరికే చాలా బ్రౌన్ బ్రెడ్ ప్యాకెట్లలో అసలైన గోధుమ పిండి ఉండదు. కంపెనీలు మైదా పిండినే (White Bread) తయారు చేసి, దానికి కారామెల్ (Caramel - E150) అనే కృత్రిమ రంగును కలుపుతున్నాయి.
ALSO READ:లంచ్ బాక్స్‌లో ఆపిల్ ముక్కలు నల్లగా మారిపోతున్నాయా?దీనివల్ల తెల్లటి బ్రెడ్ బ్రౌన్ రంగులోకి మారి "హెల్దీ బ్రెడ్" లా కనిపిస్తుంది. ఇలాంటి నకిలీ బ్రెడ్ తినడం వల్ల ఫైబర్ రాకపోగా.. రంగుల వల్ల కెమికల్స్ కడుపులోకి వెళ్తాయి.
డాక్టర్లు ఏం చెబుతున్నారు? "రంగులు కలిపిన నకిలీ బ్రౌన్ బ్రెడ్ తినడం కంటే.. కనీసం రంగులు లేని వైట్ బ్రెడ్ తినడమే బెటర్" అని నిపుణులు తేల్చి చెబుతున్నారు. నకిలీ బ్రౌన్ బ్రెడ్ వల్ల డబుల్ డ్యామేజ్ జరుగుతుంది.
మరి మంచి బ్రెడ్‌ని గుర్తించడం ఎలా? మీరు కొనే బ్రెడ్ ప్యాకెట్ వెనుక 'Label' ను తప్పక చదవండి.
మొదటి పదం: ఇంగ్రేడియంట్స్ (Ingredients)లో మొదటి పేరు 'Whole Wheat Flour' అని ఉండాలి. ఒకవేళ 'Refined Wheat Flour' లేదా 'Maida' అని ఉంటే అది కొనకండి.
రంగు: లేబుల్‌లో 'Caramel Color' లేదా 'E150' అని ఉంటే అది రంగు కలిపిన బ్రెడ్ అని అర్థం.
100% ట్యాగ్: ప్యాకెట్ మీద '100% Whole Wheat Bread' అని రాసి ఉంటేనే నమ్మండి.
ముగింపు: బ్రెడ్ ఏదైనా సరే అది నిల్వ ఉండటానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు. కాబట్టి అన్నిటికంటే మన ఇంట్లో చేసుకునే తాజా గోధుమ చపాతీలు లేదా జొన్న రొట్టెలే ఆరోగ్యానికి ఎల్లప్పుడూ శ్రేష్ఠం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

