గుమ్మడి గింజలు Vs సన్‌ఫ్లవర్ గింజలు: ఈ రెండింటిలో ఏది తింటే సూపర్ బెనిఫిట్స్? నమ్మలేని నిజాలు!

sun flower seeds
ఈ మధ్యకాలంలో హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్లు డైట్‌లో విత్తనాలకు (Seeds) బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. సూపర్‌ఫుడ్స్‌గా పిలిచే వీటిలో సన్‌ఫ్లవర్ (పొద్దుతిరుగుడు) గింజలు, గుమ్మడి గింజలు అత్యంత ప్రజాదరణ పొందాయి. అయితే, ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్? దేని వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి? ఎవరెరు ఏవి తినాలో ఇప్పుడు చూద్దాం.

సన్‌ఫ్లవర్ గింజలు: గుండె పదిలం.. యవ్వనం మీ సొంతం!
సన్‌ఫ్లవర్ గింజలు కేవలం రుచిలోనే కాదు, పోషకాల్లోనూ టాప్. ఒక ఔన్స్ (సుమారు 28 గ్రాములు) 

సన్‌ఫ్లవర్ గింజల్లో కింది పోషకాలు ఉంటాయి:
కేలరీలు: 164
ప్రోటీన్: 6 గ్రాములు
ఫైబర్: 2 గ్రాములు
కీలక పోషకాలు: విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్
ప్రయోజనాలు:
ఇందులో ఉండే విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్లు చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వృద్ధాప్య ఛాయలను అడ్డుకుంటాయి.

శరీరంలో మంట, వాపులను తగ్గించే సి-రియాక్టివ్ ప్రోటీన్ (CRP) స్థాయిలను ఇవి నియంత్రిస్తాయి.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదం నుంచి కాపాడుతాయి.

ఎలా తినాలి?: వీటిని నేరుగా స్నాక్స్‌లా తినవచ్చు. లేదా సలాడ్‌లు, ఓట్స్, స్మూతీస్, పెరుగులో కలుపుకుని కూడా తీసుకోవచ్చు.

గుమ్మడి గింజలు: రోగనిరోధక శక్తికి కేరాఫ్ అడ్రస్!

సన్‌ఫ్లవర్ గింజలతో పోలిస్తే గుమ్మడి గింజల్లో కేలరీలు కాస్త తక్కువగా ఉంటాయి. ఒక ఔన్స్ 

గుమ్మడి గింజల్లో ఉండే పోషకాలు:
కేలరీలు: 151
ప్రోటీన్: 7 గ్రాములు

ఫైబర్: 1.7 గ్రాములు

పోషకాలు: ఒమేగా-6 కొవ్వులు, మెగ్నీషియం, ఫాస్పరస్

ప్రయోజనాలు:
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ఫాస్పరస్ మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల పుష్టికి, రక్తపోటు నియంత్రణకు మేలు చేస్తుంది.

ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అద్భుతంగా అదుపు చేస్తాయి.

కిడ్నీలు, మూత్రాశయంలో రాళ్లు (Bladder stones) ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ (Monopause) సమయంలో వచ్చే హార్మోన్ల సమస్యలను తగ్గించడంలో గుమ్మడి గింజలు రామబాణంగా పనిచేస్తాయి.

ముగింపు:
ఈ రెండింటిలోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, పోషకాల సాంద్రత, తక్కువ కేలరీలు, మహిళల హార్మోన్ల సమతుల్యత విషయానికి వస్తే గుమ్మడి గింజలు కొంచెం పైచేయి సాధిస్తాయని చెప్పవచ్చు. మెరుగైన ఆరోగ్యం కోసం ఈ రెండింటినీ కలిపి (మిక్స్‌డ్ సీడ్స్) మీ డైట్‌లో భాగం చేసుకోవడం సర్వ శ్రేయస్కరం!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top