జిమ్ వద్దు, కఠినమైన డైట్ వద్దు.. ఇంట్లోనే ఉంటూ ఈ 3 సింపుల్ ట్రిక్స్‌తో నెల రోజుల్లో 5 కిలోలు తగ్గండి!

weight loss tricks
బరువు తగ్గాలంటే జిమ్‌లో చెమటోడ్చాలి, ఇష్టమైన భోజనం మానేయాలి.. ఇదంతా పాత ముచ్చట. అసలు ఎలాంటి ఖర్చు లేకుండా, ఇంట్లోనే ఉంటూ స్మార్ట్‌గా బరువు తగ్గే అద్భుతమైన మార్గాలున్నాయి. ఆ 3 సింపుల్ రూల్స్ ఏంటో చూసేయండి.

1. ప్లేట్ మార్చండి - రిజల్ట్ చూడండి: మీరు రోజూ తినే పెద్ద ప్లేట్ కి బదులు చిన్న ప్లేట్ లో తినడం అలవాటు చేసుకోండి. సైకాలజీ ప్రకారం చిన్న ప్లేట్‌లో కొద్దిగా అన్నం పెట్టుకున్నా నిండినట్లు అనిపిస్తుంది. దీనివల్ల తెలియకుండానే మీరు తక్కువ తింటారు.

2. భోజనానికి ముందు నీళ్లు: మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేయడానికి కనీసం 20 నిమిషాల ముందు రెండు గ్లాసుల నీళ్లు తాగండి. ఇది మీ ఆకలిని సగం తగ్గిస్తుంది. కడుపు నిండిన ఫీలింగ్ వల్ల అతిగా తినడాన్ని కంట్రోల్ చేయవచ్చు.
3. నమిలి తినడమే అసలైన సీక్రెట్: అన్నం తినేటప్పుడు టీవీ లేదా మొబైల్ చూస్తూ కాకుండా, ప్రతి ముద్దను కనీసం 20 సార్లు నమిలి మింగండి. నెమ్మదిగా తినడం వల్ల త్వరగా కడుపు నిండుతుంది, జీర్ణక్రియ కూడా సులువుగా జరుగుతుంది.

ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వండి, మీ బరువు ఆటోమేటిక్‌గా కంట్రోల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా "ఎలా తగ్గావు?" అని అడగడం ఖాయం!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top