Drumstick Leaves Chutney: రుచికరమైన మునగాకు పచ్చడిని ఇలా చేసుకోండి.. వారానికి రెండు సార్లు తినడం ఆరోగ్యకరం.. ఇంటి పెరట్లోనో, మార్కెట్లో 10 రూపాయలకో దొరికే మునగాకు అంటే ఐరన్, కాల్షియం, విటమిన్ A, C ల గని గని!
ఎప్పుడూ పప్పులో వేసుకుంటే, ఫ్రై చేసుకుంటే బోర్ కొట్టేస్తుంది కదా…అందుకే ఈసారి నోరూరించే, పిల్లలు కూడా “ఇంకా కావాలి అని” అడిగే మునగాకు చట్నీ రెడీ చేసేయండి.
నేటి కాలంలో పిల్లల్లోనే కాదు, పెద్దవాళ్లల్లో కూడా అనీమియా సమస్య భారీగా ఉంది. ఐరన్ టాబ్లెట్స్ కంటే సహజంగా దొరికే మునగాకును రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోండి… ఫలితం కళ్లారా కనిపిస్తుంది!
వేడి వేడి అన్నంలో నెయ్యి కలిపి, లేదా ఇడ్లీ-దోసల్లో ముంచుకుంటూ తింటే… రుచి ఏమాత్రం తక్కువ ఉండదు, ఆరోగ్యం డబుల్!
ALSO READ:తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే నాలుగు సింపుల్ చిట్కాలు – రోజూ పాటిస్తే డై వేయాల్సిన అవసరమే ఉండదు..కావలసిన పదార్థాలు (4-5 మందికి):
మునగాకు - 2 పెద్ద గుప్పెళ్లు (కాండాలు తీసేసి ఆకులు మాత్రమే శుభ్రంగా కడిగి పెట్టుకోండి)
నూనె - 2 టేబుల్ స్పూన్లు
పల్లీలు - 1 టేబుల్ స్పూన్
శెనగ పప్పు - 1 టేబుల్ స్పూన్
మినపప్పు - ½ టీస్పూన్
జీలకర్ర - ¼ టీస్పూన్
మిరియాలు - ¼ టీస్పూన్
ఉల్లిపాయ - 1 మీడియం సైజు (ముక్కలు చేసుకోవాలి)
పచ్చిమిర్చి - 2 (రుచికి తగినట్టు)
ఎండుమిర్చి - 2
చింతపండు - నిమ్మకాయ సైజు చిన్న ఉసిరి అంత (5 నిమిషాలు నీళ్లలో నానబెట్టుకోండి)
తాజా కొబ్బరి తురుము - 2-3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
తాలింపుకి: ఆవాలు, మినపప్పు, కొద్దిగా కరివేపాకు, 1 ఎండుమిర్చి, 1 టీస్పూన్ నూనె
తయారీ విధానం (చాలా సింపుల్):
పాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేడెక్కించండి. పల్లీలు, శెనగపప్పు, మినపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు దోరగా వేయించండి. రంగు మారగానే జీలకర్ర + మిరియాలు వేసి ఒక 10 సెకన్లు వేగనివ్వండి. పక్కన పెట్టేయండి.
అదే పాన్‌లో మిగతా 1 స్పూన్ నూనె పోసి… ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చింతపండి వేసి ఉల్లిపాయలు పారదర్శకంగా అయ్యే వరకు వేగనివ్వండి.ఇప్పుడు శుభ్రం చేసిన మునగాకు వేసి, సన్నని మంట మీద 7-8 నిమిషాలు బాగా వేయించండి. ఆకు పచ్చి వాసన పోయి, మెత్తగా, కొంచెం వాలిపోయినట్టు అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. పూర్తిగా చల్లారనివ్వండి.
ALSO READ:ఈ 5 విత్తనాలు చెడు కొలెస్ట్రాల్‌ని సహజంగా తగ్గించి.. గుండెని దృఢంగా కాపాడతాయి!మిక్సీ జార్‌లో ముందు వేయించిన పప్పులు + మునగాకు మిక్స్ + తాజా కొబ్బరి తురుము + ఉప్పు వేసి ముందు పొడిగా మెత్తగా గ్రైండ్ చేయండి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చట్నీ కొంచెం గట్టిగానే (ఇడ్లీకి అంటుకునేలా) రుబ్బుకోండి.
ఒక చిన్న బాండీలో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు దించండి. ఈ తాలింపును చట్నీ మీద పోసి బాగా కలపండి.
అంతే… సూపర్ రుచికరమైన, ఐరన్‌తో నిండిన మునగాకు చట్నీ రెడీ! ఫ్రిడ్జ్‌లో 3-4 రోజుల వరకు ఉంటుంది. వారానికి రెండు సార్లు తింటే రక్తహీనతకు గుడ్ బై చెప్పొచ్చు.


