హిందూ ద‌ర్శ‌శాస్త్రం ప్ర‌కారం ఎట్టి పరిస్థితుల్లో కింద‌పెట్ట‌కూడని 5 వ‌స్తువులు ఇవే.!


హిందూ ద‌ర్శ‌శాస్త్రం ప్ర‌కారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. వాటిని క్రిందన కాని, అశుభ్రమైన ప్రదేశాలలో కాని, మంచం మీద కాని పెట్టము. పూజకు ఉపయోగించే పూలు, కొబ్బ‌రికాయ‌, అగ‌ర్‌బ‌త్తీలు, క‌ర్పూరం… లాంటి వ‌స్తువుల‌ను కింద పెట్ట‌ము,ఒకవేళ కింద పడితే వాటిని పూజకు ఉపయోగించము. వీటితో పాటు హిందూ ద‌ర్శ‌శాస్త్రం ప్ర‌కారం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను కింద‌పెట్ట‌కూడదు. అలా పెడితే అంతా అశుభ‌మే జ‌రుగుతుంద‌ని న‌మ్మ‌కం.ఇంతేకీ అస్సలు క్రింద పెట్టకూడని ఆ 5 వ‌స్తువులు ఏమిటో తెలుసుకుందాం…

CLICKHERE : ఉగాదిని 29నే చేసుకోవాలి…లేకపోతే ఇబ్బందులే!

జంధ్యం…
హిందువుల్లో చాలా మందికి జంధ్యం ధ‌రించే ఆచారం ఉంటుంది. జంధ్యాన్ని త‌ల్లిదండ్రులు, గురువుల‌కు ప్ర‌తి రూపంగా భావిస్తార‌ట‌. అందువలన జంధ్యంను కింద పెడితే వారిని అవ‌మానించిన‌ట్టే అవుతుంద‌ట‌. అందుక‌ని దాన్ని ఎప్పుడూ నేల‌పై పెట్ట‌కూడ‌దు.

CLICKHERE : 7 శనివారాలు ఇలా చేస్తే తీరని కోరికలు తీరడమే కాకుండా.... అష్టఐశ్వర్యాలు సిద్దిస్తాయి

శివ‌లింగం, సాలిగ్రామం…

శివ‌లింగం అలాగే నేపాల్‌లోని గండ‌కీ న‌ది తీరంలో ఓ ర‌క‌మైన న‌ల్ల రాయి సాలిగ్రామం ను ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకూడదు. సాలిగ్రామం ను విష్ణువుకు ప్ర‌తిరూప‌మ‌ని చెబుతారు. వీటిని క్రిందన పెడితే అన్నీ స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ట‌.

దీపం…
దేవుడి ముందు పెట్టే దీపాల‌ను నేల‌పై పెట్ట‌రాదు. వాటిని వెలిగించినా , వేలించక పోయినా ఎల్ల‌ప్పుడూ వాటిని శుభ్ర‌మైన వ‌స్త్రంపై ఉంచాలి. నేల‌పై పెట్ట‌రాదు. అలా చేస్తే దేవుళ్లు, దేవత‌ల‌ను అవ‌మానించిన‌ట్టే అవుతుంద‌ట‌.

CLICKHERE : థైరాయిడ్ సమస్యకు రోజూ రెండు స్పూన్ల తేనెతో ఇలా చెక్ పెట్టొచ్చు!!

బంగారం…
బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ రూపంగా చూస్తారు. అలాంటి బంగారాన్ని నేలపై పెడితే, లక్ష్మిదేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలు పడతారు.

శంఖువు…
శంఖువులో సాక్షాత్తూ ల‌క్ష్మీ దేవి కొలువై ఉంటుంద‌ట‌. కాబ‌ట్టి దాన్ని కూడా నేల‌పై పెట్ట‌రాదు. పెడితే ఆర్థిక స‌మ‌స్య‌లు క‌లుగుతాయ‌ట‌.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top