మీ కురులు పొడిబారకుండా, ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు

మీ కురులు పొడిబారకుండా, ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. అన్నిటిలోకెల్లా ఆలివ్ ట్రీట్‌మెంట్ ఉత్తమమైనది. అదెలాగంటే..

- ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్‌లో అర టేబుల్ స్పూను కొబ్బరినూనె కలిపి రాత్రి పడుకునే జుట్టుకి పట్టించి మర్నాడు పొద్దునే తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.

- అర కప్పు ఆలివ్ ఆయిల్‌లో నాలుగు వెల్లుల్లి రేకలు వేసి ఓ పదినిమిషాలు మరిగించాలి. ఈ నూనెని తలకు పట్టించి పది నిమిషాల తర్వాత స్నానం చేయాలి. దీనివల్ల తెల్లజుట్టు రావడం తగ్గుతుంది. చుండ్రు వంటి సమస్యలు కూడా రాకుండా చూస్తుంది.

- ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, కొబ్బరి నూనె సమపాళ్లలో కలిపి జుట్టుకి పట్టించి ఓ గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టురాలే సమస్య తగ్గుతుంది. వెంట్రుకల చివర చిట్లడం కూడా తగ్గుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top