విశాఖతీరం వెంబడి ఉన్న పర్యాటక ప్రదేశాల వివరాలు

విశాఖపట్నం, దాని పరిసరాలు సుందర దృశ్యాల నిలయాలు. వైవిధ్యమైన వాతావరణంలో అలరారుతున్న విశాఖనగరంలోని సముద్రం ఒడ్డున రామకృష్ణాబీచ్ ఉంది. దేశవిదేశీ పర్యాటకులతో ఈ బీచ్ సందడిగా ఉంటుంది. నగరంలోని ఉడాపార్క్‌లో క్యామెల్, హార్స్‌రైడ్‌లు ప్రత్యేకత. నగరానికి సమీపంలో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు అటవీప్రాణులతో ఆహ్లాదకరంగా ఉంటుంది. 

విశాఖనుంచి భీముని పట్నం దారిలో ‘రుషికొండ’ ఉంది. రుషికొండ బీచ్‌గా పేరు గాంచిన ఈ ప్రదేశం సుందర ప్రకృతి దృశ్యాలకు నెలవు. విశాఖపట్నానికి 30 కి.మీల దరంలో భీముని పట్నం ఉంది. ఈ దారి దాదాపు సముద్రం తీరం వెంబడే సాగుతుంది. ఇక్కడి బీచ్ బీమిలీ బీచ్‌గా ప్రసిద్ధి. వీకెండ్‌స్పాట్‌గా పేరుగాంచింది. విశాఖనుంచి అరకు వెళ్లే దారిలోప్రకృతి సహజమైన బొర్రా గుహలు ఉన్నాయి. ఈ గుహల్లో పర్యాటక శాఖవారు అందమైన లైట్లను అమర్చారు. ఇది సమ్మర్ స్పాట్‌గా, షూటింగ్ స్పాట్‌గా ప్రసిద్ధి. భీముని పట్టణానికి సమీపంలో పావురాల కొండ ఉంది. దీనిని నర్సింహ కొండ అంటారు. ద హిల్ ఆఫ్ ద పీజియన్స్‌గా పేరుగాంచిన ఈ కొండ మీద మౌర్యుల కాలానికి చెందిన స్థూపం ఒకటి ఉంది. అరకు వెళ్లే మార్గంలో తైడ గ్రామం ఉంది.

టూరిస్టులకు వేసవి విడిదిగా ఉన్న ఈప్రాంతం సుందర ప్రకృతి దృశ్యాలకు నెలవు. ఇక్కడ ఉడెన్ కాటేజీలు ఉంటాయి. అందమైన పక్షిజాతులు చూడవచ్చు. విశాఖకు 16 కిలోమీటర్ల దూరంలో తోట్ల కొండ ఉంది. ఇది ఒకప్పుడు ప్రముఖ బౌద్ధక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం.విశాఖ నగరానికి ఉత్తర దిక్కున కైలాసపర్వతం ఉంది. ఈ పర్వతానికి ప్రభుత్వం రోప్‌వే సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top