స్కేబిస్ (గజ్జి) - లక్షణాలు, చికిత్స

గజ్జి (స్కేబిస్) దురదతో కూడిన ఒక అంటువ్యాధి. ఇది సార్కాప్టెస్ స్కేబీ అనే ఒక పరాన్నజీవి వల్ల వస్తుంది. ఇది 1-3 మి.మీ. పొడవుగా ఉండి చర్మంలో కన్నాల వంటి రంధ్రాలు చేసి దురదను పుట్టిస్తుంది. ఈ కన్నాలు దారాల్లా కనిపిస్తాయి. ఈ పరాన్నజీవులు పాకుతాయి గానీ ఎగరలేవు. 

వ్యాధి వ్యాప్తి ఇలా... 
వ్యాధిగ్రస్తుల వస్తువులను ఇతరులు వాడటం వల్ల 

వ్యాధిగ్రస్తులతో సన్నిహితంగా ఉండటం వల్ల 

వ్యాధిగ్రస్తుల పక్కబట్టలను, దుస్తులను ఉపయోగించడం వల్ల 

లక్షణాలు: చర్మంపై చిన్నచిన్న కురుపుల్లా వస్తాయి. ఇవి చేతి వేళ్లమధ్య, మణికట్టు, కీళ్ల వెనక, నడుము, నాభి, పాదాల వద్ద ఎక్కువగా వస్తాయి. చిన్న పిల్లల్లో ముఖం, మెడ, అరచేతులు, అరికాళ్ల మీద కూడా వస్తాయి. 

చర్మంపై వచ్చే కురుపుల్లో దురద చాలా ఎక్కువ. శరీరంపై వచ్చే కన్నాలు దారాల్లా కనపబడతాయి. ఇవి 2 - 15 మి.మీ. పొడవుండి ఎరుపు, బూడిదరంగు లేదా గోధుమరంగులో ఉంటాయి. దురద వల్ల కన్నాలను సరిగా గమనించడం సాధ్యం కాదు. 

వ్యాధి తర్వాత వచ్చే పరిణామాలు: తీవ్రమైన దురద వల్ల చర్మం దెబ్బతిని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. స్టెఫాలోకోకస్, బీటా హీమోలైటిక్ స్టెఫాలోకోకై వంటి బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. 


నార్వీజియన్ లేదా క్రస్టెడ్ స్కేబిస్: ఇది స్కాబిస్‌లో తీవ్రమైన ఒక రకం. మొదట్లో దీన్ని నార్వేలో చూశారు. ఇది సాధారణంగా మానసిక వికలాంగుల్లో, శరీరభద్రత వ్యవస్థ లోపించిన వారిలో, ఎయిడ్స్, లింఫోమా వ్యాధులు ఉన్నవారిలో రావచ్చు. లక్షణాలు శరీరమంతటా కనిపిస్తాయి. ఇది మోకాళ్లు, అరచేతులు, నుదురు, అరికాళ్ల మీద ఎక్కువగా కనిపిస్తుంటుంది. మొదట చర్మం పొట్టులా ఉండి, దురద కొద్దిగా ఉంటుంది. ముందు ముందు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కు దారి తీయవచ్చు. సాధారణంగా స్కాబీస్‌లో కాకుండా దీనిలో దురద తీవ్రంగా ఉండదు. 

చికిత్స: స్కేబిస్‌కు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. మెర్క్‌సాల్, హెపార్ సల్ఫ్, సల్ఫర్, పెట్రోలియమ్, ఎకినేషియా వంటి మందులను హోమియోలో ఉపయోగిస్తారు. వ్యాధి లక్షణాలను, రోగి వ్యక్తిత్వాన్ని పరిగణనలో తీసుకుని అవసరమైన మందులను నిపుణులైన వైద్యులు నిర్ధారణ చేయడం వల్ల మంచి ఉపశమనం కనిపిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top