అధిక బరువు తగ్గడానికి. తినే పద్ధతిలో మార్పులు తెచ్చుకుంటే బరువు తగ్గడం చాలా సులభము

అధిక బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు తినే ఆహారాన్ని తగ్గిస్తే మరికొందరు అన్నం మానేసి చపాతీలే తింటారు. మరికొందరు వాకింగ్‌తో సన్నబడేందుకు ట్రై చేస్తుంటారు. మరి కొందరు ఎందుకైనా మంచిదని జిమ్‌లలో భారీ ఎక్సర్‌సైజులు చేస్తుంది. అయితే డైటింగ్ వల్ల బరువు తగ్గే మాట అంటుంచి విపరీతంగా ఆకలి వేయడం... క్షుద్బాధను తీర్చుకోడానికి చిరుతిళ్లు తిని శరీర బరువును పెంచుకుంటూ పోవడం కూడా జరుగుతుంటుంది. వీటి సంగతి అలా ఉంచితే ఎంత తిన్నామన్నది కాదు ఎలా తింటున్నామనేదే ముఖ్యమని అంటున్నారు డైటీషియన్లు. తినే పద్ధతిలో మార్పులు తెచ్చుకుంటే బరువు తగ్గడం చాలా సులభమని కూడా సూచిస్తున్నారు. ఆ సలహాలు ఏమిటో మీరే తెలుసుకోండి.

 భోజనం చేసే సమయంలో హడావుడిగా ముద్దలు మింగకూడదు. ఒక్కో ముద్దను బాగా నములుతూ తినాలి. దీంతో కొద్దిగా తిన్నా కడుపు నిండినట్లుగా ఉంటుంది. ఎ అలాగే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో మానేయకూడదు. దీనివల్ల జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. రాత్రంతా శరీరం ఎటువంటి ఆహారం తీసుకుని ఉండదు కాబట్టి ఉదయం నిద్ర లేచిన గంటలోపే బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే మంచిది. ఆఫీసుకు, కాలేజీకి ఆలస్యమవుతోందన్న సాకుతో అల్పాహారాన్ని ఎగ్గొట్టే పని మాత్రం చేయకూడదు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మనేస్తే మధ్యాహ్నం లంచ్‌కు ఆకలి నకనకమంటూ ఉంటుంది. దీంతో మామాలు కన్నా ఎక్కువే తినేస్తారు. అందుకే బ్రేక్‌ఫాస్ట్ వల్ల అన్ని రకాల మేలు జరుగుతుంది.

 మరో ముఖ్యమైన విషయం భోజనం చేసే సమయంలో మాట్లాడడం, పుస్తకాలు చదవడం, టీవీ చూడడం వంటి ఇతర విషయాలపై దృష్టి పెట్టకూడదు. ధ్యాసంతా తినే ఆహారంపైనే ఉండాలి. దీని వల్ల ఎంత తింటున్నామో తెలుస్తుంది. భోజనం చేసే సమయంలో ధ్యాస వేరే విషయం మీద ఉంటే మెదడు మనం ఎంత ఆహారం తీసుకుంటున్నామో గుర్తించదు. దీంతో ఆహారం మోతాదు మించి ఊబకాయానికి దారితీస్తుంది. అందుచేత తినే సమయంలో ఏకాగ్రత అంతా దాని మీదే ఉండాలి.

 అలాగే ఒకేసారి కడుపు నిండేటట్లు భోజనం చేయకూడదు. అది అరగడానికి ఏ ఐదారుగంటలో పడుతుంది. దీంతో కడుపులో అసిడిటీ వంటివి ఏర్పడతాయి. తినే ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే విడతలు విడతలుగా ఆహారాన్ని తీసుకోవాలి. అలాగని లంచ్ ఎంత తింటామో అంత పరిమాణాన్ని అన్ని సార్లు తీసుకోవాలని కాదు. రోజుకు ఆరుసార్లు ఆహారం తీసుకునే విధంగా సమయాన్ని విభజించుకోవాలి. కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం వల్ల తినే ఆహారం త్వరగా జీర్ణం కావడంతో జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయగలదు.

 బాగా ఉడికించిన ఆహారాన్ని సాధ్యమైనంత వరకు తీసుకోవడం తగ్గించాలి. ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఆ పదార్థంలోని పోషకాలు తరిగిపోతాయి. కూరగాయలు వంటివి బాగా మెత్తబడేలా ఉడికించకుండా కొద్దిగా మెత్తబడుతున్నప్పుడే దింపేయాలి. బాగా మెత్తబడిపోయిన కూరలను తినడం వల్ల కడుపునిండినట్లుగా అనిపించదు. దీంతో మళ్లీ ఏదైనా చిరుతిళ్లను ఆశ్రయించాల్సి వస్తుంది. అలాగే వేపుడు పదార్థాలను కూడా దూరంగా ఉంచాలి.

 భోజనానికి ఓ అరగంట ముందు పండ్లను తినడం మంచిది. పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. అంతేకాదు..ఖాళీ కడుపులోకి పండ్లు వెళితే అవి కడుపులోని ఆమ్లాలను నిర్మూలించడంతోపాటు కొత్త శక్తిని అందచేస్తాయి. అందుకే భోజనానికి ముందు కొద్దిగానైనా ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. ఎ రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం మానివేయాలి. మీరు నిద్రపోయేది రాత్రి పది గంటలకైనా భోజనం మాత్రం 8 గంటలలోపే పూర్తి చేసేయాలి. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కొద్దిసేపు వాకింగ్ చేసి నిద్రకు ఉపక్రమిస్తే మంచిది. ఒకవేళ నిద్ర పోయేముందు మళ్లీ ఆకలి వేస్తుందన్న భయమేదైనా ఉంటే భోజనం చేసిన వెంటనే హెర్బల్ టీ తాగడమో, దంతాలను బ్రష్ చేసుకోవడమో చేస్తే మళ్లీ తినాలన్న ఆలోచన రాదు.

 రోజుకు ఎన్నిసార్లు నీళ్లు తాగితే అంత మంచిది అని చాలామందికి తెలుసుకుని ఏ సమయంలో ఎంత నీళ్లు తాగాలో మాత్రం తెలియదు. భోజనం చేస్తూ మధ్య మధ్యలో నీరు తాగితే తినే ఆహారం జీర్ణం కావడం ఆలస్యమవుతుంది. దీనివల్ల జీర్ణక్రియకు తోడ్పడే ఆమ్లాల పనితీరులో ఇబ్బంది ఏర్పడుతుంది. తీసుకున్న ఆహారంలోని పోషకాలు కూడా సక్రమంగా శరీరానికి చేరవు. అందుచేత భోజనం చేయడానికి పావుగంట ముందు కాని పావు గంట తరువాత కాని నీరు తాగాలి. ఒకవేళ భోజనం చేసే సమయంలో నీరు తాగడం తప్పనిసరైతే కొద్ది కొద్దిగా నీటిని చప్పరించాలే తప్ప గడగడా తాగకూడదు.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top