యుంగ్ టైగర్ 'సింహాద్రి' గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ను స్టార్‌గా నిబెట్టిన చిత్రం ‘సింహాద్రి’. ఈ సినిమా ఎన్టీఆర్‌ ఎదగడానికి ఎంతగా ఉపయోగపడ్డదో ఆయన కెరీర్‌ పడిపోవడానికి కూడా కారణం అయ్యింది. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ప్రముఖ స్థానంను కలిగి ఉన్న ‘సింహాద్రి’ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

ఎన్టీఆర్‌, రాజమౌళిల కాంబినేషన్‌లో ‘స్టూడెంట్‌ నెం.1’ వచ్చిన దాదాపు రెండు సంవత్సరాలకు ‘సింహాద్రి’ చిత్రం వచ్చింది. ‘స్టూడెంట్‌ నెం.1’ తర్వాత రాజమౌళి తన రెండవ సినిమాగా ఈ చిత్రాన్ని మళ్లీ ఎన్టీఆర్‌తోనే తెరకెక్కించాడు.

CLICKHERE : కాలేజ్ కుర్రాడిలా అలరిస్తున్న మహేష్ బాబు వయస్సు ఎంత ? 

తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన ఈ సినిమా తమిళంలో ‘గజేంద్ర’గా, కన్నడంలో ‘కంఠీరవ’గా రీమేక్‌ అయ్యింది. ఇక హిందీలో ఈ చిత్రం డబ్బింగ్‌ అయ్యింది. మూడు భాషల్లో కూడా ఈ చిత్రం మరోసారి సూపర్‌ హిట్‌ అయ్యింది.

CLICKHERE : ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రముఖ హీరోలు..!


ఎన్టీఆర్‌ 20 సంవత్సరాల వయస్సులోనే ఈ సినిమా చేశాడు. అతి తక్కువ వయస్సులో ఈ స్థాయి సినిమాను చేసే అవకాశం ఎన్టీఆర్‌కే దక్కింది. చిన్న వయస్సులో అతి పెద్ద సక్సెస్‌ను దక్కించుకున్న హీరోగా కూడా ఎన్టీఆర్‌ రికార్డు సాధించాడు.
‘సింహాద్రి’ చిత్రం లెక్కనేన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. అప్పటి వరకు ఏ సినిమా సాధించని కలెక్షన్స్‌ను కొన్ని ఏరియాల్లో సాధించి సినీ వర్గాల వారికి సైతం షాక్‌ ఇచ్చింది.

CLICKHERE : యాంకర్ రవి పై లాస్య సంచలన వ్యాఖ్యలు

ఈ చిత్రం 247 థియేటర్లలో విడుదల అయ్యింది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సంఖ్య 350కు పెరిగింది. సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో పలు ఏరియాల్లో రెండవ వారం నుండి ప్రదర్శించారు.

173 కేంద్రాల్లో 50 రోజులు, 120 కేంద్రాల్లో 100 రోజులు, 52 కేంద్రాల్లో 175 రోజులను ఈ చిత్రం పూర్తి చేసుకుంది.

5.5 కోట్ల బడ్జెట్‌తో తెరక్కెన ఈ సినిమా విడుదలకు ముందే 10 కోట్ల బిజినెస్‌ను చేసింది. విడుదల తర్వాత ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 35 కోట్లను వసూళ్లు చేయగలిగింది. ఈ స్థాయిలో వసూళ్లు వస్తాయని చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఊహించలేదు.

CLICKHERE : ఉప్పు ఎంత మాయ చేస్తుందో తెలుసా

మొదటి సారి ఒక సినిమాలో హీరో కోసం ప్రత్యేకంగా ఆయుదం తయారు చేయించారు. ఎన్టీఆర్‌ వాడిన ఆయుదం అప్పట్లో సంచలనం అయ్యింది. ఆ సినిమా కోసమే రాజమౌళి ప్రత్యేకంగా దాన్ని డిజైన్‌ చేయించాడు. ఎన్టీఆర్‌ చేతిలో ఆ ఆయుదాన్ని చూసి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు.

ఈ సినిమాలో భూమిక మరియు అంకితలు తమ గ్లామర్‌తో దుమ్ము రేపారు. వీరిద్దరు చాలరన్నట్లుగా ఒక ఐటెం సాంగ్‌లో రమ్యకృష్ణను కూడా దించేసి ఆమె అందాలను కూడా దర్శకుడు ఆరబోయించాడు. మాస్‌ ఆడియన్స్‌ కోరుకునే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇంత పెద్ద సక్సెస్‌ అయ్యింది.

CLICKHERE : మహేష్ అలవాట్లపై షాకింగ్ నిజాలు

‘సింహాద్రి’ సినిమా తర్వాత నాలుగు సంవత్సరాల పాటు ఎన్టీఆర్‌ మరో సక్సెస్‌ మొహం చూడలేదు. ‘సింహాద్రి’గా చూసి ఎన్టీఆర్‌ను మరో సినిమాలో, మరో పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్‌ సైతం ఆసక్తిని చూపలేదు. అందుకే అన్ని వరుస ఫెయిల్యూర్స్‌. ఎన్టీఆర్‌ ఒకానొక సమయంలో ‘సింహాద్రి’ సినిమాతో రాజమౌళి తన జీవితాన్ని నాశనం చేశాడు అన్నాడు.

CLICKHERE : తొడలు రాసుకుని ఎర్రగా కందితే...ఏమి చేయాలి?

CLICKHERE : మంచు లక్ష్మి పెళ్లి ఎలా జరిగిందో....తెలుసా?


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top