జియో వినియోగదారులకు హెచ్చరిక.. ఆ లింక్ క్లిక్ చేస్తే బుక్కయినట్టే!

రోజువారీ డౌన్‌లోడ్ పరిమితిని అప్‌గ్రేడ్ చేసుకోండి అంటూ ‘రిలయన్స్ జియో’ నుంచి మీకు కూడా మెసేజ్ ఏమయినా వస్తే జాగ్రత్త. అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే కాదు.. మీ పర్సనల్ డేటా కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు వేస్తున్న పన్నాగాలు అని తేలింది. ఇటీవల ఫేస్‌బుక్, ట్విటర్లలో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ‘రిలయన్స్ జియో వినియోగదారులు తమ రోజువారీ డేటా డౌన్‌లోడ్ పరిమితిని 1 జీబీ నుంచి 10 జీబీకి అప్ గ్రేడ్ చేసుకునేందుకు ఈ లింక్ మీద క్లిక్ చేయండి’ అని ఓ లింక్ ఇస్తున్నారు. 

CLICKHERE : మూడు పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ ప్రముఖులు



ఆ లింక్ మీద క్లిక్ చేయగానే.... ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, అడ్రస్ వంటి వినియోగదారుడి వ్యక్తిగత సమాచారం అడుగుతున్నారు. అన్ని వివరాలు రాబట్టిన తర్వాత ఇక రెండో స్టెప్‌లో... ‘‘మీ వాట్సప్ గ్రూప్‌లోని మిగతా ఫ్రెండ్స్ కూడా జియో సేవలను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు గ్రూప్‌లోని మిగతా ఫ్రెండ్స్‌తో కూడా దీన్ని షేర్ చేసుకోండి’’ అని అడుగుతారు. లేదా ‘‘ జియో సర్వీసును అప్‌గ్రేడ్ చేసుకునేందుకు మీరు కనీసం పది మంది ప్రెండ్స్‌కి దీన్ని షేర్ చేయాలి’’ అని చెబుతున్నారు. http://upgrade-jio4g.ml/ పేరుతో అచ్చం జియో కంపెనీకి చెందినట్టు చూపిస్తూ ఫేక్ ఆఫర్లలోకి సైనప్ అయ్యేలా బోల్తా కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

CLICKHERE : పెళ్ళికి ముందే తల్లులు అయిన హీరోయిన్స్

అయితే అదే పేజ్‌లో కింద ఇచ్చిన నియమ నిబంధనల్లో మాత్రం తమకు, రిలయన్స్ జియోకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అంటే వ్యక్తిగత డేటాను పంచుకున్న వినియోగదారులు, వారి సోషల్ మీడియా మిత్రులు తమ సొంత రిస్కుతో ఇందులో సైనప్ అయినట్టన్నమాట. కాబట్టి జియో వినియోగదారులారా బహుపరాక్!

CLICKHERE : పవన్ ఫస్ట్ హీరోయిన్ చెప్పిన షాకింగ్ విషయాలు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top