Weight Loss Drink In telugu: మారిన జీవన శైలి కారణంగా ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది రక్తహీనత, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారు ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు.
ఒక కివి పండును తీసుకుని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత బ్లెండర్ తీసుకొని దానిలో కట్ చేసి పెట్టిన కివి పండు ముక్కలు, గింజ తీసిన మూడు ఖర్జూరాలు, రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక గ్లాసు నీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో ఒక స్పూన్ నానబెట్టిన చియా గింజలు వేసి బాగా కలిపి తాగాలి. ఈ డ్రింక్ ని వారంలో మూడు లేదా నాలుగు సార్లు తాగితే అధిక బరువు, రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా కంటిచూపు బాగుంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


