Cold And Cough Home Remedies In telugu:ఈ మధ్య కాలంలో సీజన్ తో సంబంధం లేకుండా వేధించే సమస్యలలో దగ్గు, జలుబు మొదటి స్థానంలో ఉంటున్నాయి. దగ్గు, జలుబు వచ్చాయంటే అంత తొందరగా తగ్గవు.
ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాని ఫాలో అయితే దగ్గు, జలుబు రెండు రోజుల్లోనే తగ్గిపోతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒకటిన్నర గ్లాసుల నీటిని పోసి నీరు కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ తరిగిన అల్లం ముక్కలు, ఒక స్పూను వెల్లుల్లి ముక్కలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క,రెండు లెమన్ స్లైసెస్ వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి.
మరిగిన నీటిని వడగట్టి ఒక స్పూను తేనె కలిపి తాగాలి. రోజులో రెండు సార్లు తాగుతూ ఉంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ డ్రింక్ లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన జలుబు, దగ్గు గొంతు నొప్పి, గొంతు వాపు,శ్వాస సంబంధ సమస్యలు అన్నిటినీ తగ్గిస్తుంది.
అలాగే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను తగ్గించి మైండ్ రిఫ్రెష్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఉన్నప్పుడు ఈ డ్రింక్ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


