Saggubiyyam Vadiyalu:ఆంధ్ర భోజనంలో munching చాలా స్పెషల్. ఏదైనా నంజుకోవడం అంటే చాలా ఇష్టపడతారు. ఆవకాయ - వడియాలు, అప్పడాలు , పప్పు - వడియాలు, చల్ల మిరపకాయలు , పప్పుచారు ఏదైనా fryons కచ్చితంగా ఇష్టపడుతూ ఉంటారు.
రోజు అవసరమే కాబట్టి ఇలా సంవత్సరం అంతా ఉపయోగపడే సగ్గుబియ్యం వడియాలు పెట్టుకుంటే స్నాక్స్ లా తినొచ్చు. భోజనంలో కూడా munching ల తినొచ్చు. అయితే ఇప్పుడు ఈజీగా ,టేస్టీగా, క్రిస్పీగా ఉండే ఈ సగ్గుబియ్యం వడియాలు ఎలాగో చూద్దాం.
కావలసినవి:
ఒక కప్పు లావు సగ్గుబియ్యం, నాలుగు కప్పుల నీళ్లు, రెండు స్పూన్లు జీలకర్ర, సరిపడా ఉప్పు.
చేయు విధానం:
ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు లావు సగ్గుబియ్యం తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మూడు కప్పుల నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. నాన పెట్టడం వల్ల నీళ్లు తక్కువగా పడతాయి. త్వరగా సగ్గుబియ్యం ఉడుకుతాయి.
రెండు గంటలు నానిన తర్వాత water ని drain చేయాలి . వాటిని ఏమి కలపనవసరం లేదు చిదపకుండా చూసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి రోలింగ్ బాయిలింగ్ అయ్యేవరకు ఉడికించి అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేయాలి.
పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. అందులో మనకు రుచికి సరిపడా సాల్ట్ ని, రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టమైతే పచ్చి మిర్చి పేస్ట్ ,ఎండుమిర్చి flakes, మిరియాల పౌడర్ ఇలాంటివి add చేసుకోవచ్చు.
సగ్గుబియ్యం Transparent అయ్యే వరకు ,చిక్కగా వచ్చేవరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని మనకి నచ్చిన సైజులో ఒక గరిట తీసుకొని, ఒకదాని పక్కన ఒక్కొక్కటి కొంచెం దూరంగా కొంచెం జారిన అంటుకోకుండా ఉండేలా చూసి పెట్టుకోవాలి.
రెండు మూడు రోజుల తర్వాత అవి ఎండిపోతే వాటిని తీసి మళ్ళీతిరగ పెట్టి ఇంకొక రోజు ఎండనిస్తే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. మంచి ఎండలు ఉన్నప్పుడు పెట్టుకుంటే రెండు రోజుల్లో వడియాలు తయారవుతాయి. రెండు రోజుల్లో సంవత్సరమంతా ఉపయోగపడే sago fryons రెడీ...


