Tulasi Tea Benefits in telugu:మనలో చాలా మంది ప్రతి రోజూ ఉదయం సమయంలో టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ప్రతి రోజు తాగే టీలో కొన్ని ఆకులను చేర్చితే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
మనం ప్రతిరోజు తయారు చేసుకునే టీ లో 5 లేదా 6 తులసి ఆకులను వేసుకుని ఆ టీ తాగితే ఎన్నో సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. తులసి ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.
శరీరంలో రోగ నిరోధక శక్తి బలోపేతం అవటం వలన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ లేకుండా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఏమి ఉండవు.
అలాగే తలనొప్పి ఉన్నప్పుడు కూడా ఈ విధంగా టీ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా బరువును తగ్గించటానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ టీ తయారుచేసుకొని తాగితే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


