Raw Mango Benefits:మామిడికాయ అనగానే మనలో చాలా మందికి ఆవకాయ గుర్తుకు వస్తుంది. పచ్చి మామిడికాయ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం పచ్చి మామిడికాయలు చాలా విరివిగా లభ్యమవుతున్నాయి.
కొంతమంది పుల్లగా ఉంటాయని తినరు. అయితే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాల గురించి తెలుసుకుంటే కచ్చితంగా తింటారు . పచ్చి మామిడికాయలో విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్, కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.
పచ్చి మామిడికాయలో ఉండే పోషకాలు జీర్ణ ఎంజైమ్స్ ని స్రవించటానికి ప్రేగులను ప్రేరేపిస్తాయి. దాంతో అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ ఉండవు. ముఖ్యంగా ఈ వేసవిలో తినడం వలన వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు.
పచ్చిమామిడి లో ఉండే విటమిన్ ఏ ,సి, ఈ లు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపితం చేసి చిగుళ్ళ సమస్యలను తగ్గించడమే కాకుండా తెల్ల రక్త కణాలను పెంచి వ్యాధులతో పోరాటం చేసే శక్తిని శరీరానికి అందిస్తుంది.
పచ్చి మామిడిలో మాంగిఫెరిన్ కంటెంట్ ఉండుట వలన ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు, ఫ్యాటీ యాసిడ్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. మామిడి పండ్లలో మెగ్నీషియం, పొటాషియం కూడా ఉన్నాయి. అందుకే వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


